దళితులపై తెదేపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
తక్షణమే చంద్రబాబు, లోకేష్ లు ఎస్సీలకు క్షమాపణ చెప్పాలి
ఎమ్మెల్సీ, చిత్తూర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు కే జే ఆర్ భరత్
కుప్పం ముచ్చట్లు:

రాష్ట్రంలో దళితులను చిన్న చూపు చూడటం తెదేపా నాయకులకు సరికాదని ఎమ్మెల్సీ, చిత్తూర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు కే జే ఆర్ భరత్ మండి పడ్డారు. తెదేపా నాయకులు నారా లోకేష్ దళిత సామాజిక వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది సరికాదని ఆయన హెచ్చరించారు. దళితులకు క్షమాపణలు చెప్పాలంటూ చంద్రబాబు, లోకేష్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భరత్.. ఎస్సీ సామాజిక వర్గం పట్ల లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Tags; TDP leaders should refrain from inappropriate comments against Dalits
