-దాడిని అడ్డుకున్న ఎస్ఐ2, హెచ్ సి పైన దాడి ఘటనపై స్పందించిన ఎస్పీ
-ఎస్సై2, హెడ్ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
గుర్రంకొండ ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం లోని గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పై సోమవారం రాత్రి కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించడాన్ని అడ్డుకున్న అక్కడి ఎస్ఐ2 శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణుపై దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ కృష్ణా రావు వెంటనే స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో అమిలేపల్లికి చెందిన టిడిపి నాయకులు ద్వారక, ప్రకాష్, సాగర్, రామకృష్ణ, మల్లేశ్వర్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గుర్రంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమిలేపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఘర్షణ పడ్డాడని తీసుకొచ్చిన ఎస్ఐ2 శ్రీనివాసులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ వేణు పై కోపంతో స్టేషన్ కు వచ్చి గొడవపడ్డ విషయం తెలిసిందే . అదే సమయంలో స్టేషన్ వద్ద ఉన్న వైసిపి ఎంపీపీ ని చుసి అతనిపైన దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోగా ఎస్ఐ2, హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేశారు.
Tags: TDP leaders tried to attack Gurramkonda police station.