శ్రీ కాళహస్తీలో టీడీపీ సభ్యత్వ కారయక్రమం

Date:09/11/2018
శ్రీకాళహస్తీ ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు ప్రారంభించారు. తొలుత  పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహనికి పూలమాల వేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఎస్సీవీ  నాయుడు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ఏర్పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్నారు. నిరంతర కృషివలుడు, ఆంధ్రరాష్ట్ర అభివృద్ది కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ఎవరంటే అది ఒక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఒక్కరే అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంకన్న పాదాల సాక్షిగా మనకు ఇచ్చిన హామీని మరచి ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించనా వెనుకాడక ముందుకు వెళుతున్నారని అయ అన్నారు.  భారతదేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలబడిన  వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన అన్నారు. కార్యకర్తకు అండగా అతనికి ఎదైన జరిగితే అతని కుటుంబానికి ఆదరణగా రూ 200000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందన్నారు. అటువంటి  పార్టీలో సభ్యత్వం తీసుకోవడం  ప్రతి ఒక్కరి హక్కుగా భావించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాప్ చైర్మన్ పీఆర్  మోహన్, దేవస్థాన మాజీ చైర్మన్ శాంతారాం జై పవార్  , కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags; TDP membership in Srikalahasti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *