ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేల నిరసన

TDP MLAs protest on onion prices

TDP MLAs protest on onion prices

Date: 09/12/2019

అమరావతి ముచ్చట్లు:

ఉల్లి ధరలపై టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లి బయట నిరసన తెలిపారు. సచివాలయం ఫైర్స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతల నిరసనకు దిగారు. ఉల్లిపాయలతో దండలు మెడలో వేసుకుని వచ్చారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపించారు. తరువాత అయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయి. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని అన్నారు. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నాం. సబ్సిడీపై తక్కువ ధరలతో ఉల్లి అందించాం. ధరలు దిగివచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో  అనుమతి లేదని చంద్రబాబును గేటు వద్దే ఆపివేసారు. ఈ సందర్బంగా పోలీసులకు నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

 

కాలుష్యపు కష్టాలు

 

Tags:TDP MLAs protest on onion prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *