లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీలు  నిరసన

TDP MLCs protest led by Lokesh

TDP MLCs protest led by Lokesh

Date:11/12/2019

మంగళగిరి ముచ్చట్లు:

మంగళగిరి బస్టాండ్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్సీలు  నిరసనకు దిగారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు. వారందరూ మంగళగిరి నుండి అసెంబ్లీ వరకూ బస్ లో ప్రయాణించారు. పెంచిన ధరలు, పెరిగిన భారం గురించి లోకేష్  ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. 15 కిలోమీటర్లకు పెంచిన రేటు ప్రకారం రూపాయిన్నర పెరగాలి కానీ ఐదు రూపాయిలు అధికంగా వసూలు చేస్తున్నారు అని ప్రయాణికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. సంవత్సరానికి 700 నుండి 1000 కోట్ల భారం ప్రజల పై పడుతుంది . పెంచిన ఆర్టీసీ రేట్లు తగ్గించే వరకూ పోరాటం చేస్తామని లోకేష్ అన్నారు. పెంచుకుంటూ పోతాం అని ముఖ్యమంత్రి జగన్  అంటే, అందరూ సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు అనుకున్నారు . ఇసుక ధర, ఆర్టీసీ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. త్వరలో విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేస్తారని అయన విమర్శించారు.

 

చేరికలకు ఇంకా టైముంది

 

Tags:TDP MLCs protest led by Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *