నందిగామలో టీడీపీ నిరసన
నందిగామ ముచ్చట్లు:
నందిగామ గాంధీ సెంటర్ లో నందిగామ జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య తదితరులు వినూత్న రీతిలో నిరసన తెలియజేసారు. జగనన్న ధాన్యం డబ్బులు జగనన్న ధాన్యం డబ్బులు అని రైతులు నినాదాలు చేసారు. రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని సెంటర్ లో కూర్చుని భిక్షాటన చేసారు.
నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గలలో రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని ఆర్డీవో రవీంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతాంగం పరిస్థితి పూర్తిగా అంధకారంగా మారింది.వరి ర్తెతులు కష్టం ఎవరు చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఎవరు కూడా వారి బాధను అర్థం చేసుకోవడం లేదు ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం గా వ్యవహరిస్తుందని ధాన్యం పులిహోర చేసి మూడు నెలలు అవుతున్నా కూడా రైతులకు బకాయిలు చెల్లించలేదని రాష్ట్రవ్యాప్తంగా 1500 కోట్లు కృష్ణా జిల్లా వ్యాప్తంగా 80 కోట్లు కొత్త టార్గెట్ 15000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఇచ్చిందని మూడు నెలల నుంచి చెప్తున్నారు కానీ కొనుగోలు చేయటం లేదు కాబట్టి వరి రైతులను వెంటనే ఆదుకోవాలి రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు…

TagTDP protest in Nandigama
