టీడీపీ నిరసన

విశాఖపట్నం ముచ్చట్లు:

ప్రతిపక్షాల వార్డ్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచెయ్యాలని కోరుతూ విశాఖ జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద టీడీపీ కార్పొరేటర్లు  నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తమ వార్డ్ ల్లో అభివృద్ది  పనులు జరగకపోవడంతో వార్డులో తిరగలేకపోతున్నా మని కొన్ని ప్రాంతాల్లో పాములు సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.నగర మేయర్, జీవీఎంసీ అధికారులు ,ప్రోటోకాల్ ఉల్లంఘ నకు పాల్పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్ర తిపక్ష కార్పొరేటర్లు ఉన్న వార్డ్ లలో అభివృద్దిలో వివక్ష చూపించడం పై నినాదాలు చేశారు.నగర విద్యుత్ దీపాలు వెలగక పోవడం వంటి విషయాల్లో జీవిఎంసి నిర్లక్ష్యం పై నిరస న తెలుపుతున్నమని  ప్రతిపక్ష కార్పొరేటర్ల వార్డులో త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని లేనిపక్షం లో ప్రజలతో కలిసి అభివృద్ధికి పోరాటం చేస్తామని తెలిపారు.

 

Tags: TDP protest

Leave A Reply

Your email address will not be published.