TDP protests

టీడీపీ నిరసనలు

Date:30/11/2020

 

విజయవాడ ముచ్చట్లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రజా ప్రతినిధులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత సభ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ధర్నా చేపట్టింది. పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. తడిచిన వరి కంకులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వచ్చారు.. అసెంబ్లీకి కాలినడకన చేరుకున్నారు. 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ.. ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలన్నారు.మరోవైపు వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ప్రకటించింది. టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు వాయిదా తీర్మానం ఇచ్చారు. తుపాను సందర్భంగా రైతులను అప్రమత్తం చేయడంలో.. ప్రభుత్వం విఫలమయ్యిందని తీర్మానంలో టీడీపీ పేర్కొంది. రైతులను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది.

గ్రేటర్ ఎన్నికలకు అంతా సిద్ధం

 

Tags:TDP protests

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *