టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్ అధికార పార్టీ పై ఫైర్

Date:23/01/2021

విశాఖపట్నం  ముచ్చట్లు:

పారిశ్రామిక ప్రాంతం విశాఖపట్నం జిల్లాలో గల 87 వ వార్డు పరిధిలో వడ్లపూడి గ్రామంలో ఇంటి పన్ను కట్టలేదు అని నీటి సరఫరా ఆపివేయటం దారుణం అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు..శనివారం వార్డు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  గత రెండు రోజులు గా సచివాలయం సిబ్బంది ముక్కుమ్మడి గా పేద వాడిని పట్టి పిడించి పన్ను వసూల్ చేస్తున్నారు అని కరోనా వ్యాప్తి తో ఏడాది గా పేద ప్రజలు ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు పడి పన్నులు చెలించకపోవటం తో సచివాలయం సిబ్బంది, జీవీఎంసీ సిబ్బంది నీటి సరఫరా ఆపివేయటం దారుణం అన్నారు.. గతంలో ఎప్పుడు పేదవాడిని ఇంతలా పిడించి వసూల్ చేసిన సంఘటనలు లేవు అని ప్రస్తుత ప్రభుత్వం, జీవీఎంసీ అధికారులు ప్రజల పై ఒత్తిడి తీసుకొని వచ్చి వసూల్ చేస్తున్నారు అని అన్నారు జీవీఎంసీ 87/ వార్డు పరిధిలో రెండు రోజులు గా పలువురు నీటి సరఫరా నిలిపివేశారు అని  అన్నారు..అంతే కాకుండా సచివాలయం సిబ్బంది ప్రజల పై దురుసు గా వ్యవహారిస్తున్నారు అని పేద ప్రజల పట్ల అగౌరవం గా ఉంటున్నారు అని అన్నారు.. ఈ కార్యక్రమం లో వార్డు టీడీపీ నాయకులు వర్రే రాంబాబు, కర్రీ కన్నారావు, అప్పలనాయుడు, మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

Tags: TDP state secretary Bonda Jagan fires at ruling party

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *