జెన్కో కార్మికులకు టీడీపీ మద్దతు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 310 రోజుల నుండి పోరాటం చేస్తున్న కార్మికులకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దామోదర సంజీవయ్య ధర్మ విద్యుత్ కేంద్రాన్ని అదాని కంపెనీకి అప్పచెప్పడం దారుణం. ఏపీ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అయన అన్నారు. అందోళన చేస్తున్న కార్మికులకు తెలుగుదేశం పార్టీ, సిపిఎం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.
Tags: TDP support for Genco workers

