రౌతలపూడిలో టీడీపీ బృందం..అడ్డుకున్న పోలీసులు

రాజమండ్రి ముచ్చట్లు:

 

తూర్పుగోదావరి జిల్లా  నేడు   ప్రత్తిపాడు  నియోజకవర్గం   రౌతులఫూడిలో  అక్రమ బాక్సైట్  తవ్వకాలు జరుగుతున్నాయనే  అభియోగంపై  పరిశీలించడానికి  టిడిపి ప్రతినిధి బృందం బయలుదేరింది. విశాఖ జిల్లాలో బాక్సైట్   తవ్వకాలను  గిరిజనులు వ్యతిరేకిస్తున్నారనే  ఉద్దేశంతో తూర్పుగోదావరి జిల్లా వైపు నుండి తవ్వకాలు జరుపుతున్నారని  బృందం ఆరోపించింది. టిడిపి నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో  వెళ్ళుతున్న టిడిపి ప్రతినిధి బృందాన్ని రౌతులపూడి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. కరోనా సమయంలో కరోణ నిబంధనలకు విరుద్ధంగా ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇటువంటి పరిశీలనలు తగవని పోలీసులు అన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: TDP team intercepted by police in Rauthalapudi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *