తెలంగాణలో టీడీపీకి 10 సీట్లే…

TDP to 10 seats in Telangana

TDP to 10 seats in Telangana

Date:12/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
తెలంగాణలో టిడిపికి 8 నుండి 10శాతం ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడంతో…అఖండ మెజార్టీతో తమ విజయం ఖాయమని కాంగ్రెస్‌ నేతలు నమ్ముతున్నారు. అటు రాహుల్‌గాంధీ ఇటు తెలంగాణ నాయకులు నిర్వహించిన సర్వేలో ఇప్పటికీ తెలంగాణలో 10శాతం ఓటర్లు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని సరైన నాయకత్వం లేకపోవడంతో…వేరే పార్టీల వైపు చూస్తున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ…కెసిఆర్‌ విమర్శలకు భయపడ్డారా..? అనవసరంగా తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ఎందుకు..అని పక్కన ఉన్నారా..? దీన్ని అనుకూలంగా మలచుకోవడంలో తెలంగాణ నాయకులు ఘోరంగా విఫలమయ్యారు.
ఒకప్పుడు సీనియరు నేతలు అయిన ‘దయాకర్‌రావు, నర్సింహ్మలు, రేవంత్‌రెడ్డి’లు పార్టీలో కొనసాగితే పరిస్థితి మరో రకంగా ఉండేది. వారు ఒత్తిడి చేసి 25 నుంచి 30 సీట్లు సాధించేవారు. పదిసీట్లు ఇచ్చి సర్దుబాటు చేసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులందరూ ఒక పథకం ప్రకారం ముందుకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు గుర్తింపు ఇచ్చింది..ఎంతో మంది ఆ సామాజికవర్గ నేతలు రాజకీయంగా ఎదిగారు..కాంగ్రెస్‌లో తాను తప్ప మరో నాయకుడు ఎదగలేకపోయారని వి.హనుమంతరావు ఇటీవల మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తూ వాపోయారు. పదిశాతం ఓట్లు టిడిపికి ఉన్నాయని బయటపడడంతో..తెలంగాణ నాయకులు సీట్లు పంపిణీలో పట్టుపట్టే అవకాశం ఉంది.
కోదండరామ్‌ పార్టీకినాయకులే గానీ..ఓటర్లు లేరని టిడిపికి నాయకులు లేరు..ఓటర్లు ఉన్నారని…తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆఫ్‌ ది రికార్డుగా పలువురికి చెప్పడం జరిగింది. తమకు పదిశాతమే కాదు..సరైన సర్వే చేస్తే 15శాతం వస్తాయి..తమకు 25 సీట్లు ఇవ్వాలని తెలంగాణ టిడిపి నాయకులు పట్టుపట్టడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు తమకు పోటీ చేసే అవకాశం వస్తే చాలన్న విధంగా భావిస్తూ..పార్టీని పరోక్షంగా దెబ్బకొడుతున్నారు. ఇదే విషయంపై తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌  చంద్రబాబు తెరపైకి వస్తేనే పరిస్థితి మెరుగుపడుతుందని కుండ బద్దలు కొట్టారు.
లేదంటే కాంగ్రెస్‌ వాళ్లు పదిసీట్లు ఇచ్చి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు…దీనిని స్థానిక నాయకులు తిప్పికొట్టడంలో విఫలం అవుతున్నారని అన్నారు. బీసీ వర్గాలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని మెజార్టీ ఓటర్లు టిడిపి వైపే మొగ్గు చూపుతున్నారని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ చంద్రబాబుపై చేసిన ఆరోపణలు, విమర్శలతో ఆ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దానిని అనుకూలంగా మలచుకోగలిగితే..టిడిపికి భవిష్యత్‌లో ఎదురుండదని అన్నారు. ఈ విషయం ఆయనకు ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా తెలిసిందో.. తనకు లభించినసమాచారం వందశాతం నిజమని తెలిపారు. అపర చాణ్యుక్యునిగా రాజకీయ అనుభవం ఉన్న ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో..ఎన్ని సీట్లు ఇస్తే పొత్తుకు అంగీకరిస్తారో..శని,ఆదివారాల్లో తేలిపోనుంది.
Tags:TDP to 10 seats in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *