అండమాన్ లో టీడీపీ విజయకేతనం
విజయవాడముచ్చట్లు:
అండమాన్ నికోబార్ దీవుల్లో పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం టీడీపీకి దక్కింది. టీడీపీ మహిళా నేత సెల్వి ఎన్నికల్లో విజయం సాధించి, మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని చేపట్టారు. దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. పోర్టు బ్లెయిర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా టీడీపీకి చెందిన సెల్వి ఎన్నిక కావడం హర్షణీయం అని తెలిపారు. ఈ ఎన్నికలలో బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుతెలిపిందని అన్నారు. ప్రజా సేవలో ఆమె తన పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

Tags;
TDP victory in Andaman
