టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు

అనంతపురం ముచ్చట్లు:

టీడీపీ సానుభూతిపరులే లక్ష్యంగా వైసీపీ నాయకులు ఓట్లను తొలగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మండిపడ్డారు.ఈ మేరకూ అనంతపురంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయి, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడంతో పాటు దొంగ ఓట్లను ఎక్కించేందుకు భారీగా కుట్ర చేస్తోందన్నారు. ఓట్లను జబ్లింగ్‌ చేస్తూ ఇంటిలోని కుటుంబ సభ్యుల ఓట్లను ఓ పోలింగ్‌ కేంద్రంలో, కుటుంబ పెద్దది వేరే పోలింగ్‌ కేంద్రానికి మారుస్తూ గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారన్నారు. అనంత అర్బన పరిధిలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రోద్భలంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో టీడీపీకి చెందిన 30 ఓట్లను తొలగించేందుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

 

Post Midle

Tags: TDP votes are being deleted

Post Midle