శాసనమండలి నుండి టీడీపీ వాకౌట్
Date:22/07/2019
అమరావతి ముచ్చట్లు:
కరువు , అనావృష్టి పై సోమవారం శాసనమండలిలో చర్చ జరిగింది. మంత్రి బోత్సచ సత్యనారాయణ మాట్లాడుతతూ కరువు పై అన్ని జిల్లాల నుండి సమగ్ర నివేదికను తెప్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నా, ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు అనే దాని నివేదిక తయారు చేస్తున్నామని అయన అన్నారు. ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చర్చ జరుగుతున్న సమయంలో సభ నుండీ మంత్రి వెళ్ళిపోయారు. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెళ్లిపోవడం పై టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. చర్చ పై సరైన సమాధానం రాకపోవడం, మంత్రి మండలి నుండి వెళ్లిపోవడంతో మండలి నుండి టీడీసీ సభ్యులు వాకౌట్ చేసారు.
కాల్ మనీ పై ఎంపీ కేశీనేని నాని ట్వీట్
Tags: TDP walkout from legislature