గోదావరిలో  టీడీపీ తమ్ముళ్ల కుమ్ములాటలు

Date:17/09/2019

కాకినాడ ముచ్చట్లు:

గోదావరి జిల్లాల్లో రాజకీయ చైతన్య వేదిక రాజమహేంద్రవరం. ఇక్కడ వైసిపి సునామీని అడ్డుకుని మరీ టిడిపి రాజమండ్రి అర్బన్, రూరల్ రెండింటా ఘనవిజయం నమోదు చేసుకుంది. అంత పటిష్టంగా వున్న టిడిపిలో ఇప్పుడు నేతల నడుమ మాత్రం సఖ్యత లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి – ఆదిరెడ్డి అప్పారావు వర్గాల నడుమ ఎన్నికల ముందు తరువాత కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నడుస్తుంది.

 

 

 

 

ఇలాగే ఉంటే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పసుపుకోట కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతుంది.రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎదురు గాలిలో గెలిచి నిలిచారు టిడిపి పార్టీ వ్యవస్థాపక సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయనెప్పుడూ పార్టీ వేవ్ లోనే గెలిచేవారు. అయితే ఈసారి మొదటి సారిగా పార్టీకి వీచిన యాంటీ వేవ్ ను తట్టుకుని వైసిపి కి తూర్పుగోదావరి జిల్లాల్లో సవాళ్ళు విసురుతున్నారు. అంతే కాదు ఇప్పటికి ఆరోసారి ఎమ్యెల్యే గా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి విపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాను అధినేత ఇచ్చి గౌరవం ఇచ్చారు. అవసరమైతే స్వపక్షం లేదు విపక్షం లేదు అందరిని దుమ్మెత్తి పొసే దూకుడైన నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్, రూరల్ కార్యకర్తలతో నేరుగా సంబంధం దశాబ్దాలుగా వుంది.

 

 

 

 

అందుకే ఇప్పటివరకు రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో మూడు సార్లు పార్టీ విజయం వెనుక గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యూహం ప్రత్యేకమనే చెబుతారు. ఇందులో రెండుసార్లు పార్టీ అధికారంలో లేనప్పుడు కార్పొరేషన్ లో పసుపు జండా ఎగురవేయడం లో అద్వితీయ పాత్ర ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోషించారు. అలాంటి నేత ఇప్పుడు అర్బన్ రాజకీయాల్లో అడుగుపెట్టే ఛాన్స్ అప్పుడప్పుడే ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆదిరెడ్డి వర్గానికి మంటెక్కిపోతుంది.గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గరకు వెళ్ళే వారిని వెలివేశామనేంతగా హెచ్చరికలు ఆదిరెడ్డి వర్గం నుంచి రావడం కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తుంది.

 

 

 

 

 

 

పార్టీ అభివృద్ధికి తమ పార్టీ నాయకుడితో తిరిగితే తప్పేలా అవుతుందని వారు వాపోతున్నారు. అర్బన్ లో అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవాని గెలవడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కొంత చెక్ పడింది. అప్పారావు, ఆయన కుమారుడు శ్రీనివాస్ భవానికి అండగా వున్నారు. మరో పక్క మాజీ గూడా చైర్మన్ గన్ని కృష్ణ అప్పారావు వర్గం తో అంటీముట్టనట్లే వుంటున్నారు.

 

 

 

 

పార్టీ పిలుపు ఇచ్చే కొన్ని కార్యక్రమాలు మినహాయిస్తే ఆ తరువాత వర్గ పోరు రొటీన్ గానే నడుస్తుండటం గమనార్హం. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు ముక్కలాట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

తూర్పు, కడపల్లో పార్టీ ఖాళీయేనా

Tags: TDP younger brothers in Godavari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *