టీడీపీ ముందస్తు వ్యూహం

TDT Prerequisite

TDT Prerequisite

-వైసిపిపై ఆదిపత్యానికి చంద్రబాబు ప్రణాళిక
– అభ్యర్థుల ఎంపికలో గతానికి భిన్నంగా ముందుకు
– వైఎస్‌ఆర్‌సిపిలో ఒక్కరికి ఖరారుకానీ టికెట్లు

Date:22/09/2018

తిరుపతి ముచ్చట్లు:

2014 అసెంబ్లి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 14 లో 8 అసెంబ్లి స్థానాలు గెలిచినా అధికారానికి దూరమైంది. 6 స్థానాలలో గెలిచిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015 మే 25న కురబలకోట మండలం అంగళ్లలో రైతు సదస్సు జరిగింది. దీనికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ జిల్లా వాసి అయినప్పటికి తనకు ప్రజలు ఆదరించలేదని, తక్కువ సీట్లు ఇచ్చారని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడ జిల్లా వాసి కాబట్టి అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోచ్చారు. ఇప్పుడు దీనిపై చంద్రబాబునాయుడు స్వయంగా దృష్టి పెట్టారు. జిల్లాలో 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా నిర్ణయించే అందుకు తగ్గట్టుగా ఎన్నికలకు 8 నెలలు ముందుగానే అభ్యర్థుల ఖరారుకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నైజానికి భిన్నంగా ముందుగానే అభ్యర్థుల ఖరారు చేస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల సమయంలోనే అభ్యర్థుల జాబితా ప్రకటింఛే వారు .అయితే సొంత జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో జిల్లాలో మూడు నియోజకవర్గాలు అభ్యర్థులను ప్రకటించేశారు. పుంగనూరుకు అనీషారెడ్డి, చంద్రగిరికి పులివర్తినాని, పీలేరుకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిలను టీడీపీ తరపున పోటీ చేయడం ఖరారైంది.

ముందుస్తుగానే చదనరంగంలోకి …

పుంగనూరు , పీలేరు , చంద్రగిరి నియోజకవర్గాల్లోని వైఎస్‌ఆర్‌సిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతలరామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను ఢీకొని ఓడించాలంటే చాలా కసరత్తు జరగాలి. దీనిని గుర్తించిన చంద్రబాబు పుంగనూరులో బలహీన అభ్యర్థి అయిన వెంకటరమణరాజును తప్పించారు. పెద్దిరెడ్డితో ఢీకొని ఎదుర్కొగల సామార్థ్యం కలిగిన అనీషారెడ్డి సరైన అభ్యర్థి అని గుర్తించారు. పార్టీకి బలమైన క్యాడర్‌ ఉండటం , రామక్రిష్ణారెడ్డి కుటుంభానికి చెందిన వ్యక్తి పోటీ చేస్తే ముస్లింలు, బలిజ సామాజిక వర్గాలు అండగా ఉంటాయన్న అంచనాకు రావడంతో ఆమె పేరును ఖరారు చేశారు. నెల రోజుల్లో రెండు సార్లు అనీషారెడ్డితో చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు. పుంగనూరులో పెద్దిరెడ్డి హావాను ఎలా విలువరించాలి, ఆర్థిక , సామాజిక అంశాలను విశ్లేషించి గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చారు. పీలేరులో కిషోర్‌కుమార్‌రెడ్డి సరైన అభ్యర్థిగా గుర్తించి ప్య్రాధాన్యత ఇచ్చారు. కార్పోరేషన్‌ చైర్మన్‌ ఇవ్వడమే కాక జిల్లాలో ఆయనకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఇక్కడ వైసిపి అభ్యర్థి ఎవరైనప్పటికి పెద్దిరెడ్డి కుటుంబం మద్దతు అవసరం. లేదంటే గెలుపు కష్టమే. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇంతియాజ్‌ అహమ్మద్‌, ఇక్భాల్‌ ఆహమ్మద్‌కు టీడీపీ టికెట్లు ఇచ్చినా గెలవలేకపోయారు. 15 ఏళ్ల పాటు టీడీపీ ఎమ్మెల్యే గెలవకపోవడం, బలమైన నేత లేని కారణంగా పార్టీలో నిశ్తేజం నిండింది. ఈ పరిస్థితులలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడం ఆయన అభ్యర్థత్వం ఖరారు చేయడం పీలేరు రాజకీయాలు వెడిక్కాయి. కిషోర్‌ బలమైన నేత కావడం వైసిపి వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గెలుపు అవకాశాలపై అంచనాలు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. టీడీపీలో వెట్టించిన ఉత్సాహం కన్పిస్తోంది. ఇక చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డిని ఢీకొనాలంటే కష్టం. క్షేత్రస్థాయిలో బలంగా పాతుకుపోయిన చెవిరెడ్డిని ఓడించాలంటే ఎన్నో వచ్యీహాలు, ప్రణాళికలు కావాలి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకోవడంతో కొత్త అభ్యర్థిని టీడీపీ వెతకాల్సి వచ్చింది. జిల్లా అధ్యక్షుడు పులివర్తినాని ని చంద్రగిరి అభ్యర్థిగా ప్రకటించేశారు. చంద్రగిరిలో టీడీపీ గెలుపు అవశ్యకత గూర్చి పార్టీ నియోజకవర్గ సమావేశంలో చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. ఎలాగైన సరే గెలిచి తీరాల్సిందేనని చంద్రబాబు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కరాఖండిగా చెప్పేశారు. ఇందుకు అవసరమైన ఏ సహాయ సహకారమైన అందిస్తానని మాట ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలలో ముందస్తు ఎన్నికల వేడి రగిలింది. టీడీపీ అభ్యర్థులుగా ఖరారైన వారు ఇప్పటి నుంచే కధన రంగంలోకి అడుగుపెట్టేశారు. జిల్లాలోని మిగిలిన 11 నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికి వైసిపికి కీలకమైన ఈ మూడు నియోజవర్గాలను చంద్రబాబునాయుడు ముందుగానే టార్గెట్‌ చేశారు. ఎన్నికలకు వెళ్ళేటప్పటికి అధికారంతో ఈ నియోజకవర్గాలలో అన్ని పనులు చెక్కబెట్టి, వైసిపి అభ్యర్థులను ధీటుగా ఎదురడ్డి, ఓడించాలన్న వచ్యీహాలకు పదునుపెట్టారు.

వైస్‌ఆర్‌సిపిలో నిశ్శబ్ధం…

పై మూడు నియోజకవర్గాలకు టిడీపి అభ్యర్థులను ఖరారు చేస్తే వైఎస్‌ఆర్‌సిపిలో మాత్రం నిశ్శబ్ధం నెలకొంది. టీడీపీ అభ్యర్థులను ప్రకటించినట్టుగా ఈ పార్టీలో అభ్యర్థుల ప్రకటన గూర్చి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే 2019 లో తిరిగి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గెలిచే అభ్యర్థులే కాబట్టి మార్చాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీకే అభ్యర్థులు లేకపోవడం వల్లె వారు ముందస్తుగా ప్రకటించుకుంటున్నారని అంటున్నారు. అయితే వైఎస్‌ఆర్‌సిపి నేతల మధ్య జరుగుతున్న అంతర్గాత చర్చల్లో 14 లకు గాను 5 మంది అభ్యర్థుల ఎంపిక జరిగిపోయిందని చెప్పుకుంటున్నారు. వాటిలో కుప్పంకు చంద్రమౌలి, పుంగనూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడుకు ఆదిమూలం, జిడి నెల్లూరుకు నారాయణస్వామి ఖరారైనట్లు చెబుతున్నారు. వీరిలో ముగ్గరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు గత ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు.

వాళ్లకు ఇప్పటి నుంచే పోరాటం….

పుంగనూరు , పీలేరు, చంద్రగిరి ఈ మూడు నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లోకి అడుగుపెట్టేశారు. ఇప్పుడు వీరిని తమకు పోటీ దారులుగా బలపడకుండ అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌సిపి నేతలు వారికి ధీటుగా వ్యుహాలకు సిద్దంకావాల్సి పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. అధికారం అండతో ఈ నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులు బలమైన పునాదులు వేసుకునే అవకాశాలు లేకపోలేదు. వీరికి ధీటుగా తమకు అనూకూలంగా బలం పెంచుకోవడం ఓ ఎత్తు అయితే వారి వ్యూహలను చిత్తు చేసి, తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన పరిస్థితి వైసిపి ఎమ్మెల్యేల ముందుంది. అనీషారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయక పోవడానికి ముందు వరకు జిల్లాలో అత్యంత ఉధృక్త ఎన్నికలు జరిగే ప్రాంతంగా పీలేరుగా భావించారు. అయితే అనూహ్యంగా పుంగనూరు టీడీపీకి అనీషారెడ్డి ఖరారు కావడంతో ఇప్పుడు అందరి కళ్లు ఇక్కడికి మల్లాయి. పదేళ్లతరువాత రామక్రిష్ణారెడ్డి కుటుంబానికి చెందిన మహిళ అసెంబ్లి బరిలోకి దిగుతుండటం జిల్లా రాజకీయాలలో ఆసక్తి రేపుతోంది. ఓటమి ఎరుగని కుటుంబంగా రామక్రిష్ణారెడ్డికి పేరుంది. గత ఎన్నికల్లో వెంకటరమణరాజు పోటీ చేసినా పెద్దిరెడ్డితో ఢీకొట్టగలిగే శక్తి లేక ఓటమి చెందారు. దీనికి తోడు బీసీ ప్రయోగం వికటించి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలవంతుడు అయ్యేందుకు ఉపయోగపడింది. ఇప్పుడు అనీషారెడ్డి టీడీపీ అభ్యర్థి కావడం సామాజిక పరంగా కీలకమైన మార్పులు వచ్చే అవకాశాలపై రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. జిల్లాలో అత్యంత ఉధృక్తంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం పుంగనూరు అని విశ్లేషకులు బావిస్తున్నారు.

కొత్త సీఎస్ గా పునేటా

Tags:TDT Prerequisite

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *