Natyam ad

పల్లె బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు

మెదక్ ముచ్చట్లు:

టికెట్ల కోసం ఢిల్లీకి రావద్దు. ఇక్కడ హైదరాబాద్గాంధీ భవన్‌లో కూడా ఉండొద్దు. పట్నం వీడాలి. సీనియర్లు, ఇతర నాయకులు పల్లెబాట పట్టాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సాధక బాధలు తెలుసుకోవాలి. నాయకుల పనితీరు ఆదారంగానే అధిష్టానం టికెట్లు ఇస్తుంది. అందరూ సమర్థవంతంగా పని చేయాలని.. కాంగ్రెస్యువనేత ఇటీవల గాందీభవన్‌లో అన్నమాటలివి. ఈ మాటలు పార్టీలో సీనియర్లకు సూటిగా తగిలాయని చెప్పకోవచ్చు. హైదరాబాద్‌కు పరిమితమై ఎప్పుడో వచ్చిపోయే నేతలు ఇక పల్లె బాట పట్టేలా ప్లానింగ్చేసుకుంటున్నారు. రాహుల్వరంగల్సభ కాంగ్రెస్శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపగా అదే జోష్‌తో గ్రామాలకు వెళ్లాలని కాంగ్రెస్నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్ఫైర్బ్రాండ్ జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనంలోకి వెళ్లడానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. సీనియర్లు అయిన మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర రాజ నరసింహలు కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రాహుల్మాటలతో నేతలు గ్రామాల బాట పట్టడం పై కార్యకర్తల నుంచి సంతోషం వ్యక్తం అవుతున్నది.ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో అందరికంటే ముందే జగ్గారెడ్డి తన పల్లెబాట కార్యక్రమానికి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

 

 

 

యువనేత రాహుల్మాపై పెద్ద బాద్యతలు పెట్టారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేయాలి. అందుకే గ్రామాల్లో పర్యటిస్తాం.. అని జగ్గారెడ్డి అంటున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నియోజకవర్గంలోని సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, కంది మండలాలకు చెందిన పార్టీ అద్యక్షులు, సీనియర్లతో జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో మండలాల వారీగా ఏం అంశాలు తీసుకుందాం..? పర్యటలను ఎలా ప్లాన్చేసుకుందాం..? తదితర అంశాలపై పార్టీ శ్రేణులతో సుదీర్ఘంగా చర్చించారు. రాహుల్సభ ఎంతో ఉత్సాహాన్ని నింపిందని నాయకులు సంతోషం వ్యక్తం చేయగా అదే ఉత్సాహంతో పనిచేయాలని జగ్గారెడ్డి కోరారు. రాబోయే రోజులు మనవేనని, నాయకులు, కార్యకర్తలు సమర్థవంతంగా పని చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలను తీసుకుని గ్రామాలకు వెళదామని వరంగల్సభలో యువనేత రాహుల్ఇచ్చిన డిక్లరేషన్‌పై విస్తృతంగా ప్రచారం చేద్దామని సూచించారు. పక్కా కార్యాచరణతో ముందుకు సాగేలా జగ్గారెడ్డి ప్లానింగ్చేసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాల్లో సీనియర్లుగా పేరుపొందిన మాజీ మంత్రులు గీతారెడ్డి, దామోదర రాజ నరసింహలు ఇక జనంలోకి రానున్నారు. గీతారెడ్డి హైదరాబాద్‌లో, రాజనరసింహ సంగారెడ్డితో పాటు హైదరాబాద్‌లో ఉంటుంటారు. వీరిద్దరు నియోజకవర్గ పర్యటనలు తక్కువే ఉంటాయి. సీనియర్లు కావడంతో నియోకవర్గ నేతలంతా వీళ్ల వద్దకే వెళుతుంటారు. కాగా సీనియర్లు గ్రామాలకు వెళ్లాలని రాహుల్స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఈ జనం లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. దామోదర రాజనరసింహ సంగారెడ్డిలోనే కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారని, అవసరమైనప్పుడు అందోలు వచ్చి వెళుతున్నారని, ఇక మీదట కార్యక్రమాలు పెంచుకుంటారని చెబుతున్నారు.

 

 

వీరిద్దరూ జనం బాటపడితే అటు జహీరాబాద్, ఇటు అందోలులో కాంగ్రెస్‌లో ఊపువస్తుందని పార్టీ శ్రేణులు బావిస్తున్నారు. ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇక కాంగ్రెస్ నేతలు ఉత్సాహంగా జనం లో ఉంటారంటున్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉందని మాట్లాడిన వారికి వరంగల్రాహుల్సభ చెంప పెట్టు లాంటిదని, ఇప్పటి నుంచి ఇక కాంగ్రెస్జోరు కనిపిస్తుందని నాయకులు ధీమాతో ఉన్నారుఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికలు సమీపిస్తుండడం, ఇంతలోనే వరంగల్సభ భారీ సక్సెస్కావడంతో నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. పటాన్చెరులో కాట శ్రీనివాస్గౌడ్ఉత్సహాంగా పని చేస్తున్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్రెడ్డి, గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు సమర్థవంతంగా పనిచేస్తూ పోతున్నారు. నర్సారెడ్డి రోజువారీగా నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తున్నారు. ఇక సిద్దిపేటలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం లేదనే చెప్పాలి. ఇక్కడ దరిపల్లి చంద్రం, ఇతర నాయకులు ప్రెస్ మీట్‌లు, ఇతర పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారుమెదక్‌లో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి నిత్యం జనంలో ఉంటున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యం గా ఆయన మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నర్సాపూర్‌లో ఆవుల రాజిరెడ్డి, సోమన్నగారి రవిందర్రెడ్డి, ఆంజనేయులు గౌడ్‌లు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఉత్సహాంగా కొనసాగుతుండగా ఇక మీదట మరింత ఊపు కనిపించనున్నట్లు స్పష్టం అవుతున్నది.

 

Tags: Tea Congress leaders on their way to the countryside