ఆపరేషన్ ఆకర్ష్ కు టీ కాంగ్రెస్ తెర

హైదరాబాద్ ముచ్చట్లు:


ఆపరేషన్ ఆకర్ష్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ తెర తీసారు. అధికార టీఆర్ఎస్ లో అసంతృప్తులను గుర్తించి తమ వైపు తిప్పుకొనే కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా..టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. కానీ, దక్కలేదు. ఆ ఎన్నిక సమయంలోనే ఎన్నికల హాల్ నుంచి విజయా రెడ్డి సడన్ గా వెళ్లిపోయారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో పీజేఆర్ వారసులుగా తనకు ప్రాధాన్యత దక్కాలని విజయా రెడ్డి కోరుకున్నారు. అయితే, అక్కడ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. అదే సమయంలో తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదనే అసంతృప్తితో విజయా రెడ్డి ఉన్నారు. గతంలోనూ పలు సార్లు విజయా రెడ్డి తనలోని అసంతృప్తిని బయట పెట్టారు. విజయా రెడ్డి పార్టీ వీడుతున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఇప్పటికే చర్చలు చేసారు. వారితో తాను టీఆర్ఎస్ తోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు రేవంత్ తో సమావేశమైన తరువాత ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరనున్నట్లు విజయా రెడ్డి ప్రకటించారు. కొత్త నియోజకవర్గం నుంచి రేవంత్ పోటీ – సీనియర్లు సైతం : సునీల్ కనుగోలు కొత్త లెక్కలు తన తండ్రి రాజకీయాలను కొనసాగిస్తానని వెల్లడించారు. దీంతో..టీఆర్ఎస్ కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. పీజేఆర్ తనయుడు విష్ణు రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచిన విష్ణు.. ఇప్పుడు రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు విజయారెడ్డి తాను కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించటంతో..వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టిక్కెట్ పైన ఆ పార్టీ నుంచి హమీ దిక్కినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరిన తరువాత తాను టీఆర్ఎస్ ఎందుకు వీడిందీ విజయా రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తోంది.

 

Tags: Tea Congress screen for Operation Aakash

Post Midle
Post Midle
Natyam ad