కొత్త జోనల్ వ్యవస్థ అమలుపై టీఉద్యోగ జేఏసీ హర్షాతిరేకాలు

జగిత్యాల ముచ్చట్లు:

 

దశాబ్దాల పాటు ఉద్యోగులకు నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చిన పాత జోనల్ విధానం రద్దు నిరుద్యోగులకు ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూర్చేలా రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జగిత్యాల జిల్లా తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది .గురువారం టిఎన్జీవోల సంఘ భవన్ లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ టిఎన్జీవోల జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్, కో చైర్మన్ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎండీ వఖిల్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ తెలంగాణ రెవెన్యూ జిల్లా గౌరవాధ్యక్షులు హరి అశోక్ కుమార్ లు మాట్లాడుతూ జిల్లా జోనల్ బహుళ జోనల్ పరిధిలో కేవలం ఐదు శాతం మాత్రమే స్థానిక రిజర్వేషన్లు ఉంటాయని ఇక 95 శాతం స్థానికులకే పోస్టులు దక్కనున్నాయన్నారు జగిత్యాల జిల్లా బాసర జోనల్ పరిధిలోకి వెళ్ళటం వలన జోన్ వైశాల్యం భారీగా తగ్గడంతో ఉద్యోగులకు చాలా మేలు చేకూరనుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుతుందని క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ణయించిన అనంతరం ఖాళీలను గుర్తించి ఉద్యోగుల భర్తీకి చర్యలు చేపట్టడంతో పని భారం తగ్గుతుందన్నారు.

 

 

 

నియామకాలు పదోన్నతుల ప్రక్రియ చాలా సులభమవుతుందని అన్ని జిల్లాల వారికి సమన్యాయం జరుగుతుందని వారు వివరించారు. ఈ సమావేశంలో టిఎన్జీవోల జిల్లా కార్యదర్శి గూడ ప్రభాకర్ రెడ్డి, రెవెన్యూ జిల్లా కార్యదర్శి చేలుకల కృష్ణ ,టీఎన్జీవోల జిల్లా కోశాధికారి నుగూరి సుధీర్ కుమార్ ,రెవెన్యూ కోశాధికారి ఎన్ తిరుమల్ రావు, ఉద్యోగ జేఏసీ నాయకులు నాగేందర్ రెడ్డి, ఎలిగేటి రవీందర్, సత్యనారాయణ ,రవిచంద్ర ,షాహెద్ బాబా ,గడ్డం శశిధర్ ,రవి, పెన్షనర్ల జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్ కుమార్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, పబ్బ శివానందం, దొంతుల లక్ష్మీకాంతం, ప్రకాష్, విద్యాసాగర్ ,చంద్రిక కరుణ ,సంధ్య, శ్రావణి, ఇంద్రజ ,రాజశ్రీ ,స్వాతి తదితరులు పాల్గొన్నారు .

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Tea JAC cheers on implementation of new zonal system

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *