బాబు వేషాలకు గుణపాఠం నేర్పండి
పుంగనూరు ముచ్చట్లు:
చంద్రబాబునాయుడు డ్రామాలకు గుణపాఠం నేర్పాలని బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం బండ్లపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి , రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామ కూడలీలో పార్టీ జెండా ఎగురవేశారు. సచివాలయంలో డిజిటల్ బోర్డు ఆవిష్కరించి, కరపత్రాలు పంపిణీ చేశారు. నాగరాజారెడ్డి మాట్లాడుతూ నవరత్నాలతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని కొనియాడారు. పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రిని తిరిగి రెండవ సారి గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, గురివిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Teach Babu Vesha a lesson
