Teacher issues to be addressed

ఉపాధ్యాయుల సమస్యలు పరిస్కరించాలని

-ఉపాధ్యాయు సంఘాలు డిమాండ్

Date:28/02/2020

రామసముద్రం ముచ్చట్లు:

ఉపాధ్యాయ నమస్యలు పరిష్కారించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి హేమలత మరియు ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మురళి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామసమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాజరు విధానంతో ఉపాధ్యాయులు జీతాలు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. 11 వ పిఆర్సి ని వెంటనే అమలు చేయాలని పెండింగులో పడ్డ 4 డిఏలు మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్టియు నాయకులు ఆయూబ్ ఖాన్ , రమాదేవి, మహిదర్, సురేష్ మనోహర్, అనిల్ కుమార్, ప్రకాష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా టైలర్స్ డే వేడుకలు

Tags: Teacher issues to be addressed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *