Natyam ad

టీచర్లే.. వంటా వార్పు.

నిజామాబాద్ ముచ్చట్లు:
 
విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు గత్యంతరం లేని పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన వండి వార్చుతున్నారు. మేళ్లచెరువులోని జడ్పీ హైస్కూల్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న ఈ తంతు శనివారం వెలుగుచూసింది. వివరాల్లో వెళితే మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించాల్సిన నిర్వాహకులు గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. వారం క్రితం నిర్వాహకులకు, హెచ్‌ఎంకు మద్య జరిగిన వివాదం కాస్త ముదిరింది.దీంతో నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వండటం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయులే భోజనం వండుతున్నారు. ఈవిషయమై హెడ్‌ మాస్టర్‌ నారపరెడ్డి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులు భోజనం మెనూ పాటించడం లేదని, రుచికరమైన ఆహారం అందించడం లేదని పిల్లలు ఫిర్యాదుపై నేను వారిని మందలించడం జరిగిందని చెప్పారు. స్టాఫ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల సమక్షంలో మధ్యాహ్న భోజన కార్మికుల వివరణ కోరగా వారు సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.ఈ విషయమై ఎం‌ఈ‌ఓ కు, స్థానిక సర్పంచ్‌కు తెలియజేసనట్లు వివరించారు. ప్రస్తుతం పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉపాధ్యాయుల సహాయంతో మధ్యాహ్న భోజనం కొనసాగిస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ.. తాము 14 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండుతున్నామని చెప్పారు. ఎప్పుడూ కూడా మా మీద ఫిర్యాదులు లేవని అన్నారు. ప్రస్తుతం ఉన్న హెడ్మాస్టర్‌ ప్రవర్తన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని దీనిపై ఎంఈవో కి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
 
Tags:Teacherley .. Cooking Warp