ఉపాధ్యాయుడికి దేహశుద్ధి- అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  హెడ్ మాస్టర్  రామారావు విద్యార్థినుల పట్ల  అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామంలో నిలదీసారు. తరువాత అయన పై దాడి చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  పోలీసు కారులో హెచ్ఎం రామారావును తీసుకెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు అతి కష్టంతో అతడిని పోలీసు స్టేషన్ కు తరలించారు.  ఘటన నేపధ్యంలో సిరిపురం లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

Tags: Teacher’s body cleaning – Police stopped

Leave A Reply

Your email address will not be published.