Natyam ad

చిత్తూరులో ఉపాధ్యాయుల అందోళన

చిత్తూరు ముచ్చట్లు:
 
ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నా అప్పటికీ వేల సంఖ్యలో ఉపాధ్యాయులు కలెక్టరేట్కు చేరుకున్నారు పిఆర్సి , సిపిఎస్ లాంటి డిమాండ్తో వారు కలెక్టరేట్కు ముట్టడికి పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం నుంచి చిత్తూరు చేరుకుంటున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచారు మరికొంతమందిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు అయినప్పటికీ ఉపాధ్యాయులు వేల సంఖ్యలో కలెక్టరేట్ చేరుకోవడం విశేషం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పోలీసులు తమను అడ్డుకోవడానికి ప్రయత్నించారు ఉపాధ్యాయులు అంటున్నారు వారు కూడా ఉద్యోగుల కదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు జిల్లావ్యాప్తంగా 7000 మంది ఉపాధ్యాయులు ఈరోజు పాఠశాలలకు సెలవులు పెట్టి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా చిత్తూర్ లో కూడా ఇదే విధమైన ఆందోళన కొనసాగుతోంది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Teachers’ concern in Chittoor