Date:05/12/2019
ఏలూరు ముచ్చట్లు:
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా డీఈవో కార్యాలయం వద్ద ఏపి ఐక్య ఉపాద్యా పెడరేషన్ ఆద్వర్యంలో ఉపాద్యాయులు ధర్నా చేపట్టారు. నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేస్తున్న ప్రభుత్వం ఉపాద్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అదే విదంగా ఏపి ప్రభుత్వం విద్యావ్యవస్ధలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు కూడా ఉపాద్యాయులకు ఇబ్బందిగా మారుతున్నాయని,అమ్మవడి పధకం కార్పోరేట్ స్కూళ్లకు అమలు చెయ్యడం,తెలుగు మీడియం రద్దు చెయ్యడం లాంటి కార్యక్రమాల ప్రభుత్వ పాఠశాలలపై తీవ్రప్రభావం చూపుతోందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Tags:Teachers’ Dharna