ఉపాధ్యాయులు అరెస్ట్ తో ఉధ్యమాలు ఆగదు

Teachers do not stop the arrest with the arrest

Teachers do not stop the arrest with the arrest

Date:18/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపిఎస్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండు చేస్తూ అసెంబ్లి ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను మంగళవారం అరెస్ట్ చేశారు. దీనిపై ఉపాధ్యాయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు నల్లబ్యాడ్జిలు ధరించి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.

 

ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేంద్రబాబు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి యాదవ్‌ లు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రెండులక్షల మంది ఉద్యోగుల కడుపుకొడుతోందన్నారు. శాంతియుతంగా ఉపాధ్యాయులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసులచే అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఉపాధ్యాయుల అరెస్ట్తో ఉధ్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఈ ఉధ్యమం దావానలంలా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉంటుందని తెలిపారు. తమ ఐకమత్యాన్ని చాటిచెప్పి, సీపిఎస్‌ను రద్దు చేయించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు నేతలు రెడ్డెప్ప, నారాయణ, మురళి, శంకర్‌, అయూబ్‌ఖాన్‌, వెంకటరెడ్డి, బుడ్డన్న, కె.నారాయణ, సుధాకర్‌, సోమశేఖర్‌, నారాయణస్వామి, మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఉలవలు పంపిణీ

 

Tags: Teachers do not stop the arrest with the arrest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *