మంత్రి అమరనాథరెడ్డి ని ఆహ్వానించిన ఉపాధ్యాయులు

Teachers invited to Amarnathara Reddy

Teachers invited to Amarnathara Reddy

Date:23/11/2018
పలమనేరు ముచ్చట్లు:

పలమనేరులోని ఉర్దూ ఉన్నత పాఠశాల ఆవరణలో వచ్చే నెల జరగనున్న ఏపీ సీఎం కప్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టెన్నిస్ & వాలీబాల్ స్టేట్ మీట్ కు విచ్చేయాలని పలమనేరు వ్యాయామ ఉపాధ్యాయులు శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డిని కలిసి ఆహ్వానించారు. డిసెంబర్ నెల 8, 9, 10 తేదీల్లో జరగనున్న ఈ గేమ్స్ నందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాలబాలికలు పోటీలకు హాజరవుతారని వారు మంత్రికి వివరించారు. రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఈ పోటీలు మూడు కేటగిరిలలో నిర్వహించబడుతుందని తప్పక హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆర్.వి. బాలాజీ,అములు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ నాయకులు నూరుద్దీన్, సురేష్, అజయ్, హరి, భానుమూర్తి, రమణ తదితరులు ఉన్నారు.

ముమ్మరంగా సభ్యత్వ నమోదు పూర్తి కావాలి

Tags:Teachers invited to Amarnathara Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *