పుంగనూరులో ఉపాధ్యాయుల హర్షం…
ఆశలకు అనుగుణంగ …
ప్రభుత్వం ఉద్యోగుల ఆశలకు అనుగుణంగ 23 శాతం పీఆర్‌సి ప్రకటించడం హర్షనీయం. అలాగే కారుణ్యనియామకాలు చేపట్టడం, ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ను 62 సంవత్సరాలకు పెంచడం, ఆరోగ్యపరమైన సమస్యలకు పరిష్కారం చూపడం అభినందనీయం. ఉద్యోగులపట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏపాటితో స్పష్టమైంది. ఉద్యోగులు వైఎస్సార్‌సిపి ప్రభుత్వానికి అండగా నిలుస్తాం.
– జివి.రమణ, అధ్యక్షుడు, పీఆర్‌టియు స్టేట్ అసోసియేషన్ , పుంగనూరు.
రిటైర్మెంట్ పెంచడం శుభపరిణామం…
ఉద్యోగుల పదవి విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచడం ఊహించలేని నిర్ణయం. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల అభివృద్ధికి పెద్దపీఠ వేశారు. ఆరోగ్యం , పిట్‌మెంట్, రిజర్వేషన్లు కల్పించడం శుభపరిణామం. ఉద్యోగులకు భరోసాగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సి.దీపారాణి , ఉపాధ్యాయురాలు, ఏటవాకిలి పాఠశాల. పుంగనూరు రూరల్ మండలం.
రెండేళ్లు వయసు పెంచడం హర్షనీయం…
ప్రభుత్వాద్యోగుల పదవి విరమణ కాలాన్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని టీచర్ మురళి అన్నారు. సర్వీసును పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో పాటు పీఆర్సీ ప్రకటించడం వలన ప్రతి ఉద్యోగి, అదనపు ఆదాయం సమకూరిందన్నారు.
– జి.మురళి, టీచర్, చౌడేపల్లె.
ఊహించిన దాని కంటే ఎక్కువే…
ప్రభుత్వ ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేకూర్చారు. న్యాయమైన కోర్కెల పరిష్కారానికి చొరవ చూపారు. పదవీ విరమణ వయస్సు మరో రెండేళ్లు పెంచడం, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల మంజూరు ఆనందదాయకం. పీఆర్సీ పెంపు మెరుగ్గానే ఉంది.
-మోహన్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, సదుం.
సర్వీసు రెండేళ్లు పెంచడం హర్షణీయం…..
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో రెండేళ్లు పెంచుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తోంది. తమ మంచి మనస్సును సీఎం మరోసారి చాటుకున్నారు.
-నాగశేషారెడ్డి, టైపిస్ట్, ఎంపీడీఓ కార్యాలయం, సదుం.
పదవి విరమణ వయస్సు 62కు పెంచడం సంతోషం …
ఉద్యోగుల పదవి విరమణ వమస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం చాలా సంతోషం. సీఎం జగన్ ఉద్యోగులకు సంక్రాంత్రి కానుకగా ప్రకటించారు. 7 సంవత్సరాల క్రితం అప్పుటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాలకు తగ్గించింది. ప్రభుత్వం మళ్లీ 62 సంవత్సరాలకు పదవి విరమణ వయస్సు పెంచడం ఉద్యోగులకు ఒక వరం. అయితే కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్న ఉద్యోగులకు సీఎం వీలైనంత న్యాయం చేశారు. త్వరలోనే పదవి విరమణ చేయనున్న ఉద్యోగులకు ఇది మంచి శుభ వార్త. ఉద్యోగలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ రమణారెడ్డి , రొంపిచెర్ల.
సవరించిన కొత్త జీతాలతో ఆనందంగా ఉంది….
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు ప్రొబెషన్ పిరియడ్ పూర్తిచూసి రెగులర్ అయిన వారందరికిసవరించిన విధంగా కొత్త జీతాలు జూలైనుంచి ఇవ్వడం సంతోషకరంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడి్డ మాపై దయ ఉంచి కొత్త జీతాలు ఇవ్వడంతో సచివాలయ ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-జి. ప్రకాష్, సచివాలయ ఉద్యోగి, కల్లూరు 1,
ఇరవై శాతం సబ్సిడీతో ఉద్యోగులకు ఇళ్ళు …
ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇరవై శాతం సబ్సిడీ ఇవ్వడం మంచి పరిమాణం. పేదలకు ఇస్తున్న ఇళ్లల్లో 10 శాతం ఉద్యోగులకు కేటాయించడం సంతోషకరం. ఎన్ని ప్రభుత్వాలు మారిన ఉద్యోగులకు ఇళ్ల మంజూరు కలగా మారింది. అయితే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు ఇళ్లు ఇవ్వడంతోపాటు 20 వేలు సబ్సిడీ ఇస్తానని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కల నేటికి నేరవేరింది. కష్టకాలంలోను ఉద్యోగులకు న్యాయం జరిగింది.
-చెంగారెడ్డి , యూటిఎఫ్ మండల అధ్యక్షుడు ,రొంపిచెర్ల
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Teachers’ joy in Punganur …