Natyam ad

పుంగనూరు పాఠశాలల్లో బోదన బేష్‌

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విధానం ఎంతో అభివృద్ధి చెందిందని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహాదపడుతోందని జిల్లా సమగ్రశిక్షణా కో ఆర్డినేటర్‌ ప్రభాకర్‌వర్మ తెలిపారు. శనివారం ఆయన మండలంలోని గూడూరుపల్లె హైస్కూల్‌ను సీడీవో సుజాత, ఏపీఎం లావణ్యతో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో బోదన, వార్షిక ప్రణాళికలు, మధ్యాహ్న భోజనము, దీక్షాయాఫ్‌ , పరిశుభ్రత, ట్యాబ్‌ల వినియోగం, నూతన గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో రకరకాల అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు ఇంటికి వెళ్లి బోధన చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని , భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం మహేష్‌నారాయణ, పాఠశాల కమిటి చైర్మన్‌ రమణప్ప, ఉపాధ్యాయులు జివి.రమణ, నరసింహులు, రాజేష్‌ , శారద తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Teaching bash in Punganur schools

Post Midle