ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడం ఓ చాలెంజ్మంత్రి హరీష్ రావు

Date:13/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్లో బోధనా పద్ధతులపై పోటీ నిర్వహించారు. త్తమ నైపుణ్యం కనబర్చిన టీచర్లకు    రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ధృవీకరణ పత్రాలు అందజేసారు. మంత్రి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేసే సంస్థ. లయన్స్ క్లబ్ చేపట్టిన  ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. కరోనా లాంటి పరిస్థితుల వల్ల విద్య తో పాటు అనేక రంగాల్లో మార్పులు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడం ఓ చాలెంజ్. ప్రయివేటు విద్యార్థులకు ఫోన్లపై కొంత అవగాహన ఉండోచ్చు. కాని పేద విద్యార్థులకు ఆన్  లైన్  విధానంలో నేర్చుకోవడం కత్తి మీద సామే. టీచర్లు కూడా ఇప్పుడువిద్యార్థులుగా మారి నేర్చుకుని, విద్యార్థులకు నేర్పుతున్నారు. దీని వల్ల  దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతోందన్నారు.

 

అలా విద్య నేర్పే టీచర్లు కీలకమైన వ్యక్తులు. విద్య ఉద్యోగం కోసం కాదు. విలువలు, సామాజిక సృహ , రాజ్యాంగం పట్ల విదేయత నేర్పే దే విద్య. కాని కార్పొరేట్ సంస్థలవల్ల చదువుకోవాలి,  అమెరికా వెళ్లి ఉద్యోగం  చేయాలని తప్ప…సామాదికవిలువలు ఉండటం లేదు. విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా విద్య ఉృడాలి. చేత్త వేస్తే అది మున్సిపాలిటీ దే బాధ్యత అనేలా బభావిస్తున్నారు. కాని ఇది మన బాధ్యత అనేలా విద్యసాగాలి. కుటుంబ వ్యవస్థ పై గౌరవం కలిగేలా చూడాలని అయన అన్నారు.ఆన్లైన్ పోటీలో తమ ఉత్తమ బోదనా నైపుణ్యం కనబర్చిన టీచర్లకు అభినందనలు. ప్రభుత్వ టీచర్లు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలాచూడాలి. స్కూల్స్ ప్రారంభమైనా ఈ ఆన్ లైన్ బోధనా పద్ధతిని కొనసాగించండి. ఆన్ లైన్ బోధనా పద్ధతిలో నైపుణ్యం కనబర్చిన టీచర్లకు ధృవీకరణ పత్రాలను  మంత్రి అందజేసారు.

ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ

Tags: Teaching lessons online is not a challenge for Minister Harish Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *