టేకుతో..టోకుగా లాభాలు!

Teak with profits

Teak with profits

Date:17/07/2018
కరీంనగర్ ముచ్చట్లు:
జనాభా పెరుగుదల, పట్టణీకరణ, అక్రమార్కులు, కబ్జాలు.. కారణం ఏదైతేనేం అటవీ ప్రాంతం తగ్గిపోయింది. ప్రకృతి విధ్వంసం కొనసాగుతోంది. అందరికీ పచ్చదనం అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా పర్యావరణం ప్రమాదంలో పడిన దుస్థితి. ఈ దుష్ప్రభావానికి అడ్డుకట్ట వేసి.. రాష్ట్రాన్ని సతతహరితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటిస్తూ పచ్చదనం పరచుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉంటే.. ఈ దఫా హరితహారంలో భాగంగా.. టేకు మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత విభాగం అధికారులు కూడా అన్నిరకాల మెక్కలతో పాటూ పెద్ద ఎత్తున టేకు మొక్కలను సైతం సిద్ధం చేశారు. టేకు చెట్లతో ఆర్ధిక ప్రయోజనాలు అనేకం. అందుకే హరితహారం పథకంలో భాగంగా అందుతున్న టేక్ మొక్కలు తీసుకునేందుకు రైతులు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటికే రైతులు పొలాల్లో నాటుకున్నన టేకు మొక్కలు 90 శాతం జీవం పోసుకోగా మిగతా రకాల మొక్కల్లో 40 శాతంలోపై బతికాయి. ఈ నేపథ్యంలో రైతులు తమ సాగు భూముల్లో, గట్టు వరుసలో టేకు మొక్కలు నాటుకోవడం ఉత్తమని అధికారులు సైతం సూచిస్తున్నారు.
టేకు మొక్కలను పొలాల్లోనే కాక గట్లవెంట కూడా నాటుకోవచ్చు. ఈ మొక్కలు వృక్షాలుగా మారేవరకూ సంరక్షించుకుంటే.. అంటే దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. సాగుకు అనుకూలంగా లేని, నీటి వసతి తక్కువగా ఉన్న భూముల్లో టేకు మొక్కలను పెంచుకోవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ అధికారులను సంప్రదించి పేరు నమోదు చేసుకుంటే చాలు. సంబంధిత అధికారులే ఉచితంగా మొక్కలను సరఫరా చేయనున్నారు. టేకు మొక్కలకు పెటుబడి పెట్టాల్సిన పని లేకుండా పెంచడానికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని రకాలుగా సహకరించనుంది. ఉపాధి హామీ ద్వారా మొక్కలు సరఫరా చేయడమే కాకుండా వాటిని నాటే బాధ్యతనూ ఈ విభాగం సిబ్బందే చూసుకుంటున్నారు. గుంతలు తీయడం, మొక్కలను నాటడం వారే పూర్తిచేస్తున్నారు. ఇలా చేసినందుకు సిబ్బందికు రైతులు డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. సదరు పనులకు కూలీ డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాక మొక్కలు నాటిన నుంచి వాటిని సంరక్షించినందుకు గానూ ఏడాదికి నిర్వహణ ఖర్చులు సైతం భరిస్తోంది. గతంలో ఎరువులు, కలుపుతీత, నీటి తడుల కోసం డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుతం 400 మొక్కలు నాటితే అందులో 200 మొక్కలకు నిర్వహణ ఖర్చు కింద రైతులకు డబ్బులు ఇస్తున్నారు. దీంతో రైతులు టేకు మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చి లాభాలు పొందాలని వ్యవసాయ విభాగం కూడా సూచిస్తోంది.
టేకుతో..టోకుగా లాభాలు!https://www.telugumuchatlu.com/teak-with-profits/
Tags: Teak with profits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *