Natyam ad

3వ స్థానానికి టీమిండియా

ముంబై  ముచ్చట్లు:
 
ఈ కొత్త సంవత్సరం టీమిండియా(Team India)కు కలిసొచ్చినట్లుగా అనిపించట్లేదు. మొదటిగా సఫారీల చేతుల్లో టెస్టుల్లో వరుస రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్ చేజార్చుకున్న భారత్.. ఆ తర్వాత తొలి వన్డేలో ఓటమితో మరో ఎదురుదెబ్బ ఎదుర్కుంది. ఇక ఇప్పుడు టెస్ట్ ర్యాంకింగ్‌(ICC Rankings)లో కూడా అగ్రస్థానాన్ని కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా(South Africa)లో టెస్ట్ సిరీస్ 2-1తో ఓటమి ఎదుర్కోవడంతో భారత్(116) జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి మూడు స్థానానికి దిగజారింది.అటు యాషెస్ సిరీస్ విన్నర్‌గా నిలిచినా ఆస్ట్రేలియా 119 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండ‌వ స్థానంలో ఉంది. ఆ తర్వాత భారత్(116) మూడో స్థానంలో, ఇంగ్లాండ్(101), సౌతాఫ్రికా(99)లు నాలుగు, ఐదు స్థానాల్లో.. మిగిలిన వరుసలో పాకిస్థాన్(93), శ్రీలంక(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(53), జింబాబ్వే(31) జట్లు ఉన్నాయి.మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(2021-23) టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో మూడు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పర్యటించనుండగా.. శ్రీలంకతో భారత్ స్వదేశంలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ర్యాంకింగ్ విషయానికొస్తే.. టీమిండియా(49.07 శాతం) మూడు ఓటములు, రెండు డ్రాలు, నాలుగు విజయాలతో ఐదో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా(86.66 శాతం) నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది. ఇక శ్రీలంక రెండు మ్యాచ్‌లలో రెండు విజయాలు(100 శాతం) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Teamindia for 3rd place