టీడీపీ బ్యానర్ల చించివేత

నందిగామ ముచ్చట్లు:


నందిగామ పట్టణంలో తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన బ్యానర్లను   గుర్తుతెలియని వ్యక్తులు బ్లేడ్ లతో కోసివూశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు
అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విపరీతమైన ఆదరణ పెరుగుతుందని ఓర్వలేక అధికార పార్టీ నాయకులే సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో వదిలేసి పట్టణంలో ఉన్న మిగిలిన చోట్ల తెలుగుదేశం బ్యానర్లను చించివేశారు అని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. బ్యానర్లను చించినవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు.

 

Tags: Tearing of TDP banners

Leave A Reply

Your email address will not be published.