44 గ్రామాల్లో  కన్నీరు. 

రాజమండ్రి ముచ్చట్లు:


లంక గ్రామాలకు సంబందాలు తేగిపోయాయీ  అని  పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్  చెప్పారు. గోదావరి వరదల్లో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 44 లంక గ్రామాలూ ముంపుకు  గురికావడంతో ప్రజలని ఏలూరు జిల్లాలోని పునరావాస కేంద్రాలకి పంపారు.చాలా కుటుంభాలు దగ్గరలోని కొండల పైకి వెళ్ళిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా చివరి గ్రామలో బుదవారం వరదనీరు గ్రామాలలోకి చేరడంతో అక్క డ ప్రజల పరిస్థితి దారుణం గా ఉంది. అన్ని లంక గ్రామాలకి సంబంధాలు తెగిపోయాయి  అని అధికార్లు చెప్పారు.165 మంది పిలలని3,239 మంది భాదితులని సురక్షిత ప్రాంతాలకి  తరలించినట్టు ఏలూరు జిల్లా  కలెక్టర్  వి.ప్రసన్న కుమార్ చెప్పారు. ప్రజలని తరలించడానికి మోటార్ బోట్స్ ని ఏర్పాటు చేసా మని, అవసరం ఐతే మరికొంతమందిని తరలిస్తామని చెప్పారు.కొండల మీదకి వెళ్ళిన వారికీ తర్పలిన్లు, తాగునీరు, పాలు, ఆహరం, సోలార్ లిఘ్త అందచేసిన‌ట్టు కలెక్టర్ చెప్పారు. వేలేరుపాడు, కుకునూరు, మండలాల్లో చిగురుమామిడి, కొత్తూరు, రేపాకగొమ్ము, రుద్రమకోట గ్రామాలలో వరద ఉదృతి ఎక్కువగా ఉంది. ప్రజల తరలింపుకు కోసం 9 పడవలని ఎర్పాటుచేసారు. 48 వైద్య శిబి రాలు, 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు ప్రసన్న కుమార్ తెలిపారు.

 

 

ఆర్.డి.ఓ, నీటిపారుదల, గిరిజన సంక్షేమశాఖ, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితి సమీక్షించిమరింతమందిని సహాయక శిబి రాలకి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభావిత గ్రామాల ప్రజలని దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ, ఉప్పేరు నివాసం, శివకాశీపురం, పల్లపుగూడెం, కైవాక, నెమలిపురం పునరావాస కాలనీలకు మార్చా రని కలెక్టర్ చెప్పారుపశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి నర్సాపురం,ఎలమంచిలి,ఆచంట మండలాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు.దొడ్డిపట్ల గ్రామం వద్ద ఉన్న నదీ పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ధవళే శ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద మూడవ హెచ్చరిక జారీ చేస్తే  ముంపుకి గురి అయ్యే గ్రామాల ప్రజలని సహాయక శిబిరాలకు తరలిస్తాము అని శ్రీమతి ప్రశాంతి చెప్పారు. కనకాయలంక, బాడవ, ఎస్టీ కాలనీ, పాత నర్సాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంటుందని, వాటిని తరలించేం దుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

 

కోనసీమ జిల్లాలోని తూర్పు, మధ్య గోదావరి డెల్టా పరిధిలోని చాలా మండలాల్లోకి బుధవారం వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది.గోదావరి దాని శాఖలయిన వృద్ధ గౌతమి, వశిష్ట , వైనతేయ  యాభై-ఒక్క లంక గ్రామాలూ ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుండి విడుదలవుతున్న వరద నీరు గ్రామాలలోకి చేరుకుంటోంది.ఎస్‌ఏసీ బ్యారేజీ నుంచి15.7లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తునందునరానున్న 48 గంటలలో ఇన్ ఫ్లో పెరిగే అవకాసం ఉందని రివర్ కన్జ ర్వేటర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు  ఆర్‌.కాశీ విశ్వనాధ్ తెలిపారు. ఎన్ఏసి బ్యారేజీ  ఇన్ ఫ్లో 17.75 లక్షల క్యూ సెక్కులు వచ్చినప్పుడు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 18 వరద ప్రభావిత మండలాలలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేయడం తో పాటు ఆహరం,ప్రాదమిక అవసరాలు అందిస్తున్నామని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చెప్పారు.

 

Tags: Tears in 44 villages.

Leave A Reply

Your email address will not be published.