రైతు కంట క‌న్నీరు

Date:22/10/2020

రంగారెడ్డి ముచ్చట్లు:

జీహెచ్ఎంసీలో సాయం ప్రకటించిన సర్కారు జిల్లాలకు ప్రకటించకపోవడంతో ఆందోళన బాట పట్టారు. ములుగు జిల్లాలో రైతులు ధర్నా చేశారు.భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం
జరిగింది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో రైతుల భారీగా నష్టపోయారు. పత్తి, వరి, కంది,
సోయ, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, పంటలు బాగా దెబ్బతిన్నాయి. పెసర, నువ్వులు, మినుములకు ఇప్పటికే 80% వరకు నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 36 లక్షల
ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 15 లక్షల ఎకరాల్లో పత్తి, 12 లక్షల ఎకరాల్లో వరి, 4 లక్షల ఎకరాల్లో కంది, ఇతర పంటలు మరో 5 లక్షల వరకు పాడైపోయాయి. ఎకరాకు 40 వేలనుంచి 60 వేల పంట నష్టం జరిగిందనుకున్నా 15 వేల కోట్ల దాకా నష్టం ఉండొచ్చని అంచనా. సుమారు 8 లక్షల రైతుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడిందఈ సీజన్‌‌లో ఇప్పటి దాకామూడుసార్లు కుండపోత వర్షాలు కురిశాయి. సాధారణం కంటే 52% ఎక్కువ వానలు పడ్డాయి. 17 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.భారీ వానలకు ఉమ్మడి వరంగల్‌‌, కరీంనగర్‌‌తో పాటు అనేక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వేల ఇండ్లు పాడైపోయాయి. నేతన్నల మగ్గం గుంటలకు నీళ్లు చేరాయి. వరంగల్‌‌ అర్బన్లోవరదలకు ఇండ్లల్లోకి నీళ్లొచ్చాయి. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోలేదు. వరంగల్ లో నష్టం జరిగితే పట్టించుకోని సర్కారు.. జీహెచ్‌‌ఎంసీలో పరిహారం ప్రకటించింది. దీంతోతమను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా ప్రజలు, రైతాంగం నిలదీస్తోంది.

కోయకుండానే ఉల్లిపాయ కన్నీరు

Tags: Tears of a farmer

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *