నన్ను దోచుకుందవటే…టీజర్ దుమ్మురూపుతోంది

Date:14/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
సమ్మోహనం’తో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన హీరో సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే..’తో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తన పేరిటే బ్యానర్ ఏర్పాటు చేసిన సుధీర్.. ప్రొడ్యూసర్‌గా తన తొలి సినిమా టీజర్‌ను శనివారం ఉదయం విడుదల చేశారు. టీజర్‌ విడుదల సందర్భంగా సుధీర్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘కడుపులో ఉన్న బిడ్డ తొలిసారి తన్నినప్పుడు ఎలా ఫీలవుతుందో.. నిర్మాతగా ఇప్పుడు నేనంతే ఉత్సాహంగా ఉన్నాను. టీజర్ ఇదిగో..’ అంటూ సుధీర్ ట్వీట్ చేశారు. సుధీర్ బాబు ఈ చిత్రంలో స్ట్రిక్ట్ బాస్ పాత్రలో కనిపించనున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సిరిగా కొత్త హీరోయిన్ నభా నతేష్ కనిపించనుంది. నాజర్, తులసి వేణు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఆ.ర్.ఎస్.నాయుణ్ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. కిర్రాక్ పార్టీ, రాజరథం సినిమాలకు సంగీతం అందించిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నా రు.
నన్ను దోచుకుందవటే…టీజర్ దుమ్మురూపుతోందిhttps://www.telugumuchatlu.com/tease-me-teaser-is-dusty/
Tags: Tease me … Teaser is dusty

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *