ముంబైలో  టెక్నో గణేశ్…

Techno Ganesh in Mumbai

Techno Ganesh in Mumbai

Date:17/09/2018
ముంబై ముచ్చట్లు:
దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితిని ఘనంగా జరుపుకొంటున్నారు. గణేష్ ఉత్సవాల్లో సంతోషంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో వీధి వీధిన విఘ్నేశుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. మన దగ్గర ఒక్క అడుగు ఎత్తయిన మట్టి గణపతి మొదలు 57 అడుగుల ఎత్తయిన ఖైరతాబాద్ మహగణపతి వరకు ఎన్నో వైవిధ్యమైన గణపతి ప్రతిమలు కొలువు దీరాయి.
టెక్నాలజీ ఎంతో పురోగతి సాధించిన ప్రస్తుత రోజుల్లో వినాయకుణ్ని పూజించేందుకు రోబోలు రంగ ప్రవేశం చేశాయి. యూనివర్సల్ రోబోస్ అనే సంస్థ గణేష్ చతుర్థి నిర్వహించడానికి ఓ అప్లికేషన్ సాయంతో కోబోట్స్ అనే రోబోలను తీసుకొచ్చింది.ముంబైలోని లాల్‌బాగ్ పండల్‌లో టెక్నో ఆర్టిస్టిక్ గణేశా థీమ్‌తో ఈ టెక్నో గణపతిని ఏర్పాటు చేశారు. కోబోట్స్ పురోహితుడిలా మారి హారతి ఇస్తుండగా.. ఆ సమయంలో వినాయకుడి విగ్రహం గాల్లో తేలేలా ఏర్పాటు చేశారు. రోబోలు వినాయకుడికి హారతి ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా గణపతికి రోబోలతో హారతి ఇచ్చి టెక్నాలజీని భక్తి కోసం వాడేశారు.
Tags:Techno Ganesh in Mumbai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *