ఆచితూచి వ్యవహరిస్తున్న టీడీపీ

– అధికారులను నమ్ముకొని అడుగులు

Date:23/07/2019

విజయవాడ  ముచ్చట్లు:

వైఎస్ జగన్ దూకుడు రాజకీయాలు చేయడంలో స్పెషలిస్ట్. ఆయన రాజకీయ జీవితమే మొదలైంది అలాగే. కొండను ఢీ కొట్టి రాజకీయ అడుగులు వేసిన వైఎస్ జగన్ చివరికి పదేళ్ళ పోరాటంలో ఎన్నో ఒడుదుడుకులు చూశారు. ఆయన ఈ ప్రస్తానంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు. వైఎస్ జగన్ మొండితనం, పట్టుదల ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. అలాంటి ఇలాంటి మెజారిటీతో కాదు, ఏకంగా అ యాభై శాతం ఓట్లు, 85 శాతం సీట్లతో వైఎస్ జగన్ ఎదురులేని నాయకునిగా నిలిచారు.

 

 

 

జనం ఎంతగా వైఎస్ జగన్ ను ఇష్టపడ్డారనడానికి తాజా విజయం ఓ ఉదాహరణ. ఇంత పెద్ద ఎత్తున విజయం దక్కినపుడు దాని వెనక బరువు, బాధ్యత కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. వైఎస్ జగన్ విషయంలో జనాలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఓట్ల వరద చెబుతుంది. ఓ విధంగా భారీ అంచనాలతో వైఎస్ జగన్ పాలన మొదలైంది. ఇక జనంవైఎస్ జగన్ నుంచి ఆశిస్తున్నది తమకు అన్నీ చెప్పనట్లుగా చేస్తాడని, ఏ ఇబ్బందులు లేకుండా హామీలను అమలు చేస్తాడని. వైఎస్ జగన్ ద్రుష్టిలో చంద్రబాబు లేడు, ఆయన పాలన కూడా లేదు, వారికి పాత వాసనలు, అవినీతి అవసరం లేదు, ఆ మాటకు వస్తే వైఎస్ జగన్ నుంచి వారు పూర్తిగా కోరుకుంటున్నది తమ జీవితాల్లో కొత్త వెలుగులు కురిపించమని.

 

 

 

 

అయితే వైఎస్ జగన్ ప్రమాణం చేసిన తరువాత నుంచి పాత ప్రభుత్వం అవినీతిని తవ్వి తీయడం మొదలెట్టారు. అదొక మహా సముద్రం.టీడీపీ పాలనలో అవినీతి ఎంత లోతుల్లోకి పోయిందన్నది ఎంత విచారించిన అర్ధం కాని పరిస్థితి. వైఎస్ జగన్ మాత్రం పోలవరం, అమరావతి, విద్యుతు ఒప్పందాల్లో అవినీతిని వెలికితీసి జనానికి చూపిస్తానని, అవి ఒకవేళ తీసినా జనం చూసి ఆహా అనుకుంటారు, అంతే తప్ప దీనివల్ల వైఎస్ జగన్ కి ఒరిగేది అదనంగా వేరొకటి ఉండబోదు, ఎందుకంటే టీడీపీ ఆనవాళ్ళు కూడా లేకుండా ప్రజలు పాతరేసి తీర్పు ఇచ్చాక ఇంక ఆ పార్టీ వద్ద ఏముంది మళ్ళీ లాగేయడానికి.

 

 

 

అందువల్ల జనానికి బాబు అవినీతి ఎప్పడూ రెండవ ప్రాధాన్యతే. వాళ్ళు తప్పు చేశారు కాబట్టే పక్కన పెట్టామని అంటారు. ఇక వైఎస్ జగన్ బాబు ని ఎంత చెడ్డ చేసినా తాను చేయాల్సింది చేసినపుడే జనానికి మంచి పాలన అందించిన వారు అవుతారు. ఈ విశ్లేషణను చూసినపుడు వైఎస్ జగన్ చేస్తున్నది వృధా ప్రయాస అనకపోయినా ఆయన ప్రాధాన్యతా క్రమంలో బాబు పాలన అవకతవకలు ముందు వరసలో ఉండాల్సినవి కావేమోనన్న చర్చ నడుస్తోంది. ఇక వైఎస్ జగన్ అధికారులను గుడ్డిగా నమ్మి ముందుకు సాగుతున్నారు. అధికారులలోనూ మంచి, చెడ్డా ఉంటారు. వారు సమయానుకూలంగా రంగులు మారుస్తారు.

 

 

 

ఈ అధికారులు కూడా ఎక్కడ నుంచో ఊడి రాలేదు. వారు బాబు పాలన చూసి, ఆయన చెప్పినది చేసి వచ్చినవారే. అందువల్ల వైఎస్ జగన్ వారిని చూసుకుని దూకుడుగా ముందుకువెళ్తే రాజకీయంగా నష్టం ఆయనకే తప్ప వారికి ఉండదన్నది వాస్తవం.ఇక చంద్రబాబు మూడు మార్లు ముఖ్యమంత్రిగా అధికారం చలాయించిన వారు. ఆయనకు బ్యూరోక్రసీ ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు. తప్పు ఎపుడూ రాజకీయ నాయకుల మీదనే వేసేలా ఆ వ్యవస్థ తీరు ఉంటుంది.

 

 

వైఎస్ జగన్ ఆవేశంతో అతి విశ్వాసంతో తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ రోజు సరేనని తల వూపుతున్న అధికార గణం రేపటి రోజున తేడా వస్తే కాసుకోవడానికి ఉండదు. ఈ సంగతి వైఎస్ జగన్ కంటే బాబుకే ఎక్కువగా తెలుసు. అందుకే వైఎస్ జగన్ దూకుడు, అధికారుల సలహాలు ఇవన్నీ గమనిస్తూ నెమ్మదిగా బాబు ముందుకు సాగుతున్నారనుకోవాలి. వైఎస్ జగన్ అధికారులు తన నియంత్రణలో ఉన్నారని భావించి వేగంగా వేస్తున్న అడుగులు ఎక్కడ తడబడితే అక్కడ నుంచే తిరిగి టీడీపీ పరుగు మొదలవుతుందని బాబు రాజకీయ అంచనా వేసుకుంటున్నారు.

 

 

 

 

ప్రజా వేదిక నిర్మాణం కూల్చడం వైఎస్ జగన్ సర్కార్ చేసిన అతి పెద్ద తప్పుగా టీడీపీ భావిస్తోంది. అలాగే విద్యుతు ఒప్పందాలపై సమీక్ష చేస్తానని అనడం. రివర్స్ టెండరింగ్ ఇవన్నీ కూడా వైఎస్ జగన్ దూకుడు నిర్ణయాలని, ఎక్కడ ఒక చోట దెబ్బ పడుతుందని, అపుడు ఛాన్స్ తమదేనన్న ఆశతో టీడీపీ శిబిరం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

జగన్ పేద్ద… టార్గెట్

Tags: Teddipi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *