తెదేపా తోనే యువతకు భవిత

Tedeppa is the fear of youth

Tedeppa is the fear of youth

Date:19/09/2018

పలమనేరు ముచ్చట్లు:

తెలుగుదేశం పార్టీతోనే యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు పిబి బాలసుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిఎన్ఎస్ఎఫ్ సమక్షంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.

 

దేశంలో ఎక్కడా లేని విధంగా యువనేస్తంను తీసుకొచ్చిన ఘనత బాబుదేనన్నారు. విజన్ ఉన్న నాయకులు,రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు యువతకు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో పలువురు యువకులు చేరుతున్నారని అన్నారు.

 

పలమనేర్ పట్టణము కు చెందిన కిరణ్ కుమార్ ,ఉమా శేఖర్ ,జయశంకర్ ,ప్రకాష్ , సురేంద్ర ,సునీల్ కుమార్,వంశీ వెంకటాద్రి,షణ్ముగం, అక్బర్ శ్రీధర్ బాబు, రాజు, రాజేష్, మనోహర్ తదితరులు పార్టీలో చేరారు .ఈ సందర్భంగా వారికి టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు నదీమ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు . ఈ కార్యక్రమంలో పట్టణ 21 వార్డు కౌన్సిలర్,తెలుగు యువత పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

శ్రీ కోదండ రామ స్వామి వారికి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి వడ్డాణం సమర్పణ

Tags:Tedeppa is the fear of youth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *