వరుస హిట్లతో తేజ జోష్..

Date:17/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్స్‌తో తన జర్నీకొనసాగిస్తున్నాడు.  ఫిదా, తొలి ప్రేమ వంటి సినిమాలు భారీ హిట్స్  కొట్టడంతో వ‌రుణ్‌కి ఫుల్ కాన్ఫిడెంట్ పెరిగిన‌ట్టు తెలుస్తోంది. అంద‌మైన ప్రేమ క‌థతో తెర‌కెక్కిన తొలిప్రేమ‌ సిన్మాలో త‌న అద్భత  నటనతో  విమ‌ర్శ‌కులను సైతం కట్టిపడేశాడు ఈ మెగా హీరో. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హీరో రెండున్న‌ర కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో చేయ‌బోవు సినిమాకి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నాడ‌ని ఫిలింనగర్ లో టాక్‌ వినిపిస్తుంది. ఘాజీ వంటి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్‌డం పొందిన డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డితో నెక్స్ట్ మూవీలో వ‌రుణ్‌ చేయ‌నున్నాడు. కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ సినిమాని మేలో సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు సమాచారం.
Tags: Tej Josh with successive hits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *