తెలంగాణ 6గురు ఎమ్మెల్యేలు అనర్హులవుతారా..?

Telangana 6 Guru MLAs will not be eligible?

Telangana 6 Guru MLAs will not be eligible?

Date:20/01/2018

తెలంగాణ ముచ్చట్లు:

ఎన్నికల సంఘం చేసిన నిర్ణయం తెలంగాణ ఎమ్మెల్యేలు ఆరుగురికి చిక్కుల్లోకి నెడుతుందా..? డిల్లీలోని ఆమ్ ఆద్మి పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై మందిని ఎన్నికల సంఘం అనర్హులుగా సిఫారస్ చేస్తూ రాష్ట్రపతికి లేఖ రాసింది.అయితే తెలంగాణలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆరుగురు ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు నిర్ణయంతో వారు ఆ పదవులలో ఉండలేకపోయారు.డిల్లీ ఎమ్మెల్యేలకు వర్తించిన రూల్ వీరికి కూడా వర్తింప చేస్తే వీరు కూడా అనర్హులు అవుతారని కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు.వీరిని అనర్హులను చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాస్తుందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణలో పలువురు సలహాదారుల పదవులలో ఉన్నారని, వారిని కూడా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags : Telangana 6 Guru MLAs will not be eligible?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *