సావిత్రిబాయి పూలే 125 వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ బీసీ జాగృతి.

తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ బీసీ జాగృతి హైటెక్ సిటీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ
సావిత్రిబాయి స్ఫూర్తితో జాతీయ మహిళా దినోత్సవం ఏటేటా జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు మన దేశంలోని మహిళా సమస్యలపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవటానికి కారణం– జాతీయ అంతర్జాతీయ మహిళా సంఘాలు వర్గ దృక్పథం నుంచి తప్ప కుల వ్యవస్థ నిర్మూలన దృక్పథంతో స్త్రీల సమస్యను చూడలేకపోవడమే. మహిళా విముక్తికోసం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే–సావిత్రిబాయి పూలేలు, స్త్రీ పురుష సమానత్వం కోసం ఏర్పాటైన సత్య శోధక్ సమాజానికి నాయకురాలిగా పనిచేసిన తారాబాయి షిండే, హిందూ కోడ్ బిల్లు కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్, స్త్రీలకు స్వాభిమానాన్ని చాటిచెప్పిన పెరియార్ లాంటి మహానుబావులను ఈ మహిళా దినోత్సవాలు పట్టించుకోకపోవటం వల్లనే దేశంలో మహిళా సమస్యలపై సరైన చర్చ జరగటం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవటం ముఖ్యమే. కానీ సావిత్రి బాయి స్ఫూర్తితో ఒక జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవటం అంతకంటే ముఖ్యం. జాతీయత, స్వదేశీయత గురించి నిత్యం మాట్లాడే నేటి భారత ప్రభుత్వం, బీజేపీ శ్రేణులు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాధాన్యతను జాతీయ మహిళా దినోత్సవం జరపడానికి ఇవ్వడం లేదు. ప్రపంచ దేశాలలోని మహిళా ఉద్యమాలకన్నా ఏభై ఏళ్ల ముందే ఈ దేశ మహిళల విముక్తి కోసం త్యాగపూరిత ఉద్యమం చేసి ఎన్నో హక్కుల సాధనకు మూలమైన సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి జనవరి నెలంతా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని దేశీయ మహిళా సంఘాలు డిమాండు చేయాలి. అందుకు సావిత్రి బాయి ఫూలే 125వ జయంతి సంవత్సరమైన ఈ సంవత్సరం సముచితం. మన దేశంలో స్త్రీలు దుర్మార్గమైన దోపిడికి, అణచివేతకు గురికావడానికి, రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించబడడానికి బ్రాహ్మణ వాదమే కారణమని అంబేడ్కర్ సూత్రీకరించారు. ఈ సూత్రీకరణను పట్టించుకోని మహిళా సంఘాలు పితృస్వామిక వ్యవస్థ స్త్రీల అణచివేతకు కారణమని, పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించుకొని పోరాడుతున్నారు. బ్రాహ్మణీయ కుల వ్యవస్థ లేని పాశ్చాత్య దేశాల్లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణం. స్త్రీలను దారుణంగా అణచివేసే మనుధర్మం అక్కడ అమలులో లేదు. కానీ మన దేశంలో మనుధర్మం నిర్దేశించిన అసమానతల కుల దొంతరల సమాజం ఉంది. ఇక్కడ కులం ప్రతి స్త్రీ సామాజిక హోదాను నిర్ణయిస్తుంది. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి ఆధిపత్య కుల మహిళా సంఘాలు, ఆధిపత్య స్త్రీ వాదులు సిద్ధంగా లేరు. ఇండియా కన్నా ఏభై ఏళ్లు ఆలస్యంగా మహిళా ఉద్యమం మొదలుపెట్టిన ప్రపంచ దేశాలు ఎన్నో విజయాలు సాధించి అన్ని రంగాల్లో మహిళలకు చేయూతనివ్వగలుగుతుంటే, మన దేశంలో మహిళలు మాత్రం అదే వెనకబాటుతనంతో మిగిలిపోయారు. దీనికి కారణాలను మహిళా సంఘాలు శోధించి ముందుకు సాగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కారకురాలైన క్లారా జెట్కిన్ను గుర్తించినట్లుగానే, మన దేశంలో మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పూలేను గుర్తించి, ఆమె స్ఫూర్తితో చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరు చేయాలి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా  మీడియా కన్వీనర్ సంతోష్ ఆచార్య పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు వైద్య భాస్కర్ యువ జాగృతి పట్టణ అధ్యక్షులు మాంచర్ల సదానందం ప్రచార కార్యదర్శి బద్ది శ్రీనివాస్ మహిళా నాయకురాలు కూచి సుమలత, మడుపు అరుణ సీనియర్ నాయకులు సల్ల విజయ కుమార్, కొండపాక మచ్చయ్య భద్ర గుండ రాంబాబు, పూరెల్ల రాజమౌళి, మామిడి అశోక్ నరెడ్ల సత్య పటేల్ ,భూమేష్ రవీందర్ , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Telangana BC Jagruti pays rich tributes to Savitribai Poole 125th death anniversary

Leave A Reply

Your email address will not be published.