జార్ఖండ్ లో తెలంగాణ సీఎం క్రేజ్..

-దేశ్ కీ నేత అంటూ కేసీఆర్ ఫ్లెక్సీలు.. గులాబీమయమైన రాంచీ వీధులు
 
రాంచీ ముచ్చట్లు:
 
దేశ్‌ కీ నేత అంటూ ఫ్లెక్సీలు.! జాతీయ ఫెడరల్ లీడర్‌ అంటూ గ్రాండ్ వెల్కమ్..! తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ టూర్‌ రాజకీయంగా హాట్‌టాఫిక్‌గా మారింది. బీజేపీ ముక్త్ భారత్ అంటూ పిలుపు ఇచ్చిన
కేసీఆర్ ఇప్పుడు థర్డ్‌ ప్రంట్‌ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌తో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు
తెలుస్తోంది. ఈ చర్చలో హేమంత్ సోరెన్తండ్రి శిబూ సోరెన్ కూడా పాల్గొన్నారు ఈ మేరకు శిబూసోరెన్ ను కేసీఆర్ శాలువాతో సత్కరించారు. రాంచిలోనూ కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు,
హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈ మేరకు జాతీయ ఫెడరల్ నేతకు జార్ఖండ్ ప్రజలు ఘన స్వాగతం పలికారని CMO నోట్ రిలీస్
చేసింది. రాంచీలో గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు.గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాటమేరకు.. వారికి సాయం అందించారు. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సోరేన్‌తో కలిసి కేసీఆర్ అందజేశారు. ఎన్నికల కోడ్
 
 
ముగిసిన తరువాత మిగిలిన ప్రాంతాల్లో ప్రకటించి.. ఆయా రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు సీఎం కేసీఆర్.తెలంగాణ సీఎం పర్యటన నేపథ్యంలో రాంచీ నగరంలో పలు
చోట్ల కేసీఆర్ పేరిట బ్యానర్లు, కటౌట్లు దర్శనమిచ్చాయి. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అనే నినాదాలు కలిగిన కటౌట్లతో రాంచీ నగరంలోని వీధులు గులాబీమయమయ్యాయి. గతంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల
ప్రచారం సమయంలోనూ.. దేశ్ కీ నేత కేసీఆర్ అనే బ్యానర్లు, కటౌట్లు కనిపించాయి. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇప్పటికే మహారాష్ట్రలో
పర్యటించిన ఆయన ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రేతోపాటు.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోనూ సమావేశం అయ్యారు. అటు పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం
విజయన్‌తో పాటు పలు పార్టీల నేతలో కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారు.
 
Tags: Telangana CM craze in Jharkhand ..