కేసీఆర్ పోరాటాలతో తెలంగాణ వచ్చింది : ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

Date:16/03/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రతీ సంవత్సరం బడ్జెట్ స్థాయి పెరుగుతున్న తీరు తెలంగాణ ప్రగతి ని ప్రతిబింబిస్తోంది . మా బడ్జెట్ అంకెల గారడీ ఎంత మాత్రం కాదని ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నాడు అయన తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. .సీఎం కెసిఆర్ మాటలు అక్షర సత్యాలుగా అమలవుతాయని బడ్జెట్ మరోమారు నిరూపించింది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో జీడీపీ 5 శాతం గా నమోదయ్యేది. .ఇపుడు తెలంగాణ జీడీపీ రెండంకెల స్థాయిని దాటిందని అన్నారు. 2017 -18 బడ్జెట్ లో ప్రతిపాదించిన కేటాయింపుల్లో 95 శాతం ఖర్చు చేసిన ఘనత తెలంగాణ దే. .ప్రస్తుత బడ్జెట్ ఫలాలు ప్రతి సామాన్యుడికి కి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బడ్జెట్ ఇంత చక్కగా ఉంటే కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షలు చేస్తూ పిల్లి శాపాలు పెడుతున్నారు. కాంగ్రెస్ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. తెరాస లో చేరేందుకు తనకు కాంట్రాక్టులు ఇవ్వ జూపారనే సంపత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అంత దిగజారి ప్రవర్తించాల్సిన ఖర్మ మాకు పట్టలేదు .మంత్రి జగదీష్ రెడ్డి ,సీఎం కెసిఆర్ పై కోమటి రెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. నల్గొండ లో హత్యా రాజకీయాలు గతం లో చెడిందెవరో అందరికీ తెలుసు. ఉత్తమ్ పదేపదే అరిగిపోయిన రికార్డు లా తెలంగాణ కాంగ్రెస్ వల్లే వచ్చిందంటున్నారు. కెసిఆర్ పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని ప్రజలు గత ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని అన్నారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఎపుడో అమ్మేసే వారే. గతం లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన జైపాల్ రెడ్డి అసెంబ్లీ లో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను సమర్ధించుకోవడం దిగజారుడు తనమని విమర్శించారు. .జైపాల్ రెడ్డీ చరిత్ర హీనుడిగా మిగిలి పోవడం ఖాయం. .కెసిఆర్ ప్రతి పాదించిన కొత్త జాతీయ ప్రత్యామ్నాయాన్ని జైపాల్ రెడ్డి హేళన చేయడం సరికాదు. కాంగ్రెస్ వరస ఓటములు జీర్ణించుకోలేక జైపాల్ రెడ్డి కెసిఆర్ ఆలోచనలను తప్పు బడుతున్నారు. కెసిఆర్ శక్తి ఏమిటో త్వరలోనే దేశం చూడబోతోంది. పార్లమెంటు లో అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే trs ఎంపీ లు కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారని అయన అన్నారు. పార్లమెంట్ లో తెరాస  అనుసరించే వైఖరి ని ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే ప్రకటించారని అయన అన్నారు.
Tags: Telangana comes with KCR fighting: MLC Kurney Prabhakar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *