సర్వేలను నమ్ముకున్న తెలంగాణ కాంగ్రెస్

Date:17/04/2018

హైద్రాబాద్  ముచ్చట్లు:

2019 ఎన్నికల్లో గెలవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకునే పనిలో పడింది.ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.జనం ఆలోచనలకు అనుగుణంగా తమను తాము మలుచుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సర్వేలను నమ్ముకున్నారు. మరో వైపు ప్రముఖ రాజకీయ వ్యూహా కర్త ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపైన సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ అందుకోసం వ్యూహాలు రచిస్తోంది.బస్సుయాత్రతో జనంలోకి వెళ్తున్న నాయకులు వారిని ఆకట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దానితో పాటు కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలను నేరవేర్చడం లేదంటు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ, మూడు వేల రూపాయల నిరుద్యోగ భ్రుతి, డ్వాక్రా మహిళాలకు వడ్డీ లేని రుణం లాంటి పాపులర్ వాగ్దానాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో తెలంగాణ జనం మనోభావాలపైన మరింత అధ్యయనం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.ప్రజల ఆలోచన విధానం, వారు ఏం కోరుకుంటున్నారన్న దానిపైన స్పష్టత తెచ్చుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.జనం భావన ఆధారంగా పార్టీ వ్యవహారిస్తే మరింత ప్రయోజనం ఉంటుందన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. ఇందు కోసం ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది.సీట్లు,ఓట్లు కాకుండా జనం ఏం కోరుకుంటున్నారన్న దానిపైన ఈ సర్వే ద్రుష్టి సారించినట్లు చెపుతున్నారు.ఓటర్లను వయసుల వారీగా గ్రూపులుగా విభజించి ప్రశ్నలు వేస్తారు. ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అన్న ప్రశ్నలు సంధిస్తారు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి ఏం ఆశిస్తున్నారన్న దాని పైన కూడా సర్వే అభిప్రాయాలను సేకరిస్తుంది. ఎ.ఐ.సి.సి ఆధ్వర్యంలో జరిగే ఈ సర్వేకు పీసీసీకి ఎలాంటి సంబంధం ఉండదు.రాజకీయ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ సర్వే ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.మరో వైపు దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త టీం కూడా కాంగ్రెస్ పరిస్థితిపైన తెలంగాణలో అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఆయన టీం సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతు కాంగ్రెస్ కోసం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ, క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకుల బలాబలాలు, టీఆర్ఎస్ సర్కార్ పనితీరు, ఎమ్మెల్యేల తీరు పైన వీరు సర్వే నిర్వహిస్తున్నాట్లు చెపుతున్నారు.కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలతో ఇటీవల వ్యూహాకర్త ప్రతినిధులు సమావేశమయ్యారు. సర్వే ప్రాథమిక సమాచారాన్ని వారు ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పైన ప్రజల్లో మంచి స్పందన ఉందని,దాన్ని పార్టీ క్యాష్ చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.కేసీఆర్ పైన పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లీంచుకోవాల్సిన బాధ్యత నాయకులదేనని టీం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ సర్కార్ పైన వ్యతిరేకత పెరుగుతుందని సర్వే స్పష్టం చేసినట్లుగా చెపుతున్నారు. అయితే కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహారించి,పరిస్థితులను తన వైపు తిప్పుకోవాలని లేకుంటే ప్రయోజనం ఉండదని సదరు సర్వే సంస్థ తేల్చి చెప్పిందట.మొత్తానికి పరిస్థితులు తమకనుకూలంగా మారుతున్నాయన్న వార్తతో పార్టీ నాయకుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది.అయితే భవిష్యత్తులో కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ముందు నిలబడటం అంత సులువేమి కాదు. రైతులకు చెక్ ల పంపిణి,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు దూసుకువస్తున్న నేపథ్యంలో వాటిని తట్టుకొని నిలబడటం కష్టమే. మరి సర్వేలు కాంగ్రెస్ ను ఎంత వరకు కాపాడుతాయో చూడాలి.

Tags:Telangana Congress believes surveys

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *