Natyam ad

రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు..

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


గిరిజనుల రిజర్వేషన్లు 6శాతం నుంచి 10శాతం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. తెలంగాణాలో పోడు భూముల సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటవికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా, ఎటువంటి వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుండడం వల్ల గిరిజనులకు, దళితులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో.. దేశవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఢిల్లీలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సందర్భంగా రాములునాయక్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన నాయకులు, ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తెలంగాణకు చెందిన గిరిజన నాయకులు కలిశారు. తెలంగాణలో ఎస్టీలకు రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతం పెంచాలని గిరిజనులు కోరుతున్నారని గత ఎనిమిదేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ గిరిజనుల రిజర్వేషన్లు పెంచకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు.

 

 

తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని పార్లమెంట్‌లో చెబుతోందని మండిపడ్డారు.ఇది తెలంగాణలోని ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, పోడు భూముల సమస్యల పరిష్కారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు. తెలంగాణలోని లక్షలాది మంది గిరిజనులు అనేక దశాబ్దాలుగా క్లియరెన్స్ చేసిన అటవీ ప్రాంతాల్లో భూమిని సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు వారికి హక్కులు కల్పించాయి. ఇప్పుడు వివిధ సాకులతో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను తరిమికొట్టేందుకు క్రూరమైన పోలీసు బలగాలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు. అయితే.. 50 శాతానికి అదనంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Telangana Congress leaders met the President..

Post Midle