శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ  డిప్యూటీ సీయం మల్లు బట్టి విక్రమార్క

తిరుమల ముచ్చట్లు:

తెలంగాణలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క పేర్కొన్నారు. తిరుమల లో స్వామి వారిని దర్శనం కోసం కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆయనకి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను డిప్యూటీ సీఎం స్వీకరించారు. అనంతరం ఆలయం వేలుపల మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగు వారందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీవారి ఆశీస్సులు తెలుగు ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

Tags: Telangana Deputy Seem Mallu Batti Vikramarka visited Srivara

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *