డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు

Telangana elections on December 7

Telangana elections on December 7

Date:06/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తెలంగాణలో ఎన్నికల సైరన్ మోగింది. తెలంగాణతో పాటు  ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ (సిఇసి) ఒపి రావత్ శనివారం  మీడియా సమావేశంలో విడుదల చేశారు. రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్  నవంబర్ 12 న విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 19 కగా నామినేషన్ల పరిశీలన  నవంబర్ 20న ముగుస్తుంది. ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 22, ఎన్నికలు : డిసెంబర్ 7 న జరుగుతాయి.  ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11 న జరుగుతాయి.
అలాగే, చత్తీస్ ఘడ్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో  డిసెంబర్ 15 నాటికి రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ఈ  రాష్ట్రాల్లో  శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రావత్ చెప్పారు. ఛత్తీస్ ఘడ్  మొదటి దశలో  18 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు వుంటాయి. దానికి సంభందించి నోటిఫికేషన్  అక్టోబర్ 16 న విడుదల అవుతుంది.
నామినేషన్లు దాఖలు చివరి తేదీ: 23 అక్టోబర్,  నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 24,  ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 26 కాగా పోలింగ్  నవంబర్ 12 జరగనుంది. రెండో దశ ఎన్నికలు 72 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతాయి.
నోటిఫికేషన్ : అక్టోబర్ 26,  నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 2, నామినేషన్ల పరిశీలన: నవంబర్ 3, ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 5 కాగా పోలింగ్  నవంబర్ 20న జరుగుతాయి. మధ్య ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలో  నోటిఫికేషన్ : నవంబర్ 2 విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చివరి తేదీ: నవంబర్ 9,  నామినేషన్ల పరిశీలన: నవంబర్ 12,  ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 14. ఎన్నికలు  నవంబర్ 28 న జరుగుతాయి.
Tags:Telangana elections on December 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed