తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రా పోలీస్

Telangana elections to Andhra Police
Date:08/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణలో డిసెంబరు 7న జరిగే ఎన్నికలకు ఏపీ నుంచి పోలీసు బలగాలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ ఏపీని కోరాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖకు లేఖ రాశారు. తెలంగాణ ఎన్నికలకు ఏపీ పోలీసులు వద్దంటూ ఇప్పటికే రాష్ట్ర ఈసీ రజత్ కుమార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేనందున.
తెలంగాణ ఈసీ రాసిన లేఖ ఆధారంగా కేంద్ర హోంశాఖ, ఈసీకి అదే విషయాన్ని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేయబోతున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితంచేసే అవకాశమున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఏపీ పోలీసులు, హోంగార్డులను తీసుకోవడంలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ 5 రోజుల క్రితం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే..
ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల తెలంగాణలో డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 70 వేల మంది రాష్ట్ర పోలీసులతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా నుంచి బలగాలను రప్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సీఈసీ మాత్రం పోలీసు బలగాలను పంపాలని ఏపీ పోలీసులకు లేఖ రాశారు .
Tags: Telangana elections to Andhra Police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *